వాక్కాయ పచ్చడి/vaakaaya pachchadi

'వాక్కాయ(vaakaayalu)'లు మీకు తెలుసా, అవి చూడటనికే కాదు పుల్లపుల్లగా తినటానికి కూడా చాలా బాగుంటాయి.వీటిని క్రాన్ బెర్రీస్ అని అంటారు.అవి కొన్ని ఎర్రగాను, కొన్ని ఆకుపచ్చగాను ఉంటాయి.ఈ పచ్చడికి ఎవైనా పర్వాలేదు.మనము చిన్నప్పుడు వీటిని, చింతకాయలను, ఉసిరికాయలను ఉప్పు నంజుకుని తినేవాళ్ళం.మీకు గుర్తుందా. ఇవి కూడా సీజనల్ గా దొరికే కాయలే 'వాక్కాయ(vaakaayalu)'. కాబట్టి ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి.

Total Time: 
7min
Preparation TIme: 
2min
Cooking Time: 
5min
Ingredients: 
'వాక్కాయ(vaakaayalu)'
1/2కప్పు
పచ్చికొబ్బరి తురుము
3/4కప్పు
ఎండుమిర్చి
10
ఉప్పు
రుచికిసరిపడ
పసుపు
చిటికెడు
ధనియాలు
2స్పూన్స్
జీర
1స్పూన్
పచ్చిశెనగపప్పు
1స్పూన్
మినపప్పు
1స్పూన్
ఆవాలు
1/4స్పూన్
నూనె
2స్పూన్స్
ఇంగువ
చిటికెడు
కరివేపాకు
2రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు
10
How to prepare: 
స్టౌ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, కొంచం జీర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, కొంచం కరివేపాకు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో 'వాక్కాయ(vaakaayalu)'లలోని గింజలు తీసేసి ముక్కలుగా తరిగిన వాక్కాయ ముక్కలను వేసి కాసేపు వేయించుకుని వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలను పొడిలా చేసుకుని అందులో పచ్చికొబ్బరి తురుము, వేయించి ఉంచుకున్న వాక్కాయ ముక్కలు, రుచికిసరిపడ ఉప్పు, చిటికెడు పసుపు వేసి పచ్చడిలా చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి కొంచం నూనె వేసి కాగాక అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
అవి చిటపటమన్నాక అందులో పచ్చిశెనగపప్పు, మినపప్పు, జీర వేసి వేయించుకోవాలి.
అవి వేగాక అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి కలిపి, చేసిన పచ్చడిలో ఈ పోపును వేసి కలిపి సర్వ్ చేయండి.వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.