బిస్కెట్స్

బిస్కెట్స్ అనగానే అందరు ఒవెన్ ఉండాలి కద అనుకోకండి. ఇవి చాలా తేలికగా స్టౌ మీద చేసుకునేవి.చాలా తక్కువ టైం లో పిల్లలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మంచి స్నాక్స్ లా చేసిపెట్టండి. ఇందులో వాడే పదార్ధాలు కూదా ఏమి ఎక్కువగా ఉండవు.మా చిన్నప్పుడు వేసవి శెలవులకు అమ్మమ్మ దగ్గరకు వెళ్ళేసరికి ఇవి రెడిగా ఉండేవి.పిల్లలకు మంచి బలం కూడా. ఎందుకంటే మనం ఇందులో గుడ్డును కూడా వేసి చేస్తాం.

Total Time: 
22min
Preparation TIme: 
10min
Cooking Time: 
12min
Ingredients: 
మైదాపిండి
1 కప్పు
పంచదార పొడి
1కప్పు
ఎగ్స్
2
నెయ్యి లేదా వెన్న
కొంచం
నూనె వేయించుకోవడానికి
సరిపడ
తెల్లనువ్వులు
3 స్పూన్స్
How to prepare: 
ఒక బౌల్ లో జల్లించిన మైదాపిండి, వెన్న లేదా 4 స్పూన్స్ నెయ్యి, పంచదార పొడి, తెల్లనువ్వులు వేసి కలపాలి
అవి పూర్తిగా కలిసాక అందులో బీట్ చేసిన ఎగ్స్ ను వేసి మొత్తం కలిసేలా కలుపుకుని అవసరమైతే కొంచం నీళ్ళు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఆ పిండిని కొంచం చపాతీకి సరిపడా తీసుకుని చపాతీలా ఒత్తి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని నూనెలో ఎర్రగా వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే