నాటుకోడిపులుసు/Natukodi pulusu

అంధ్రా, రాయలసీమ స్పెషల్ నాటుకోడిపులుసు/Natukodi pulusu రుచి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.కానీ ఎక్కువగా హోటల్స్ కు వెళ్ళినప్పుడు రాగిముద్దతో లేదా ఏదన్నా పులావ్ తో దీనిని రుచి చూసి ఉంటారు.నాటుకోడిపులుసు/Natukodi pulusu ఇంట్లోనే తయారుచేసుకోవడం ఎలానో ఈ రోజు చూద్దాం.ఈ కూర వండాలంటే కొంచం ఓపిక ఉండాలి.అప్పుడే మీరు హోటల్లో ఎంజయ్ చేసిన రుచి వస్తుంది.నేను ప్రత్యేకంగా హోటల్ చెఫ్ దగ్గరకు వెళ్ళి నేర్చుకుని మీకు చెబుతున్నాను.ట్రై చేయండి.ఈ సండేని ఎంజాయ్ చేయండి.

Total Time: 
25min
Preparation TIme: 
10min
Cooking Time: 
15min
Ingredients: 
నాటుకోడి మాంసం/Natukodi
1కేజీ
ఉల్లిపాయలు
3పెద్దవి
ఉప్పు, కారం
రుచికిసరిపడ
అల్లం వెల్లుల్లి ముద్ద
3స్పూన్స్
పసుపు
1స్పూన్
నిమ్మరసం
3స్పూన్స్
పెరుగు
1/4కప్పు
ఎండుకొబ్బరిముక్కలు
3స్పూన్స్
గసగసాలు
ఒక గుప్పెడు
ధనియాలపొడి
2స్పూన్స్
జీరాపొడి
1స్పూన్
గరం మసాలాపొడి
2స్పూన్స్
చెక్క
చిన్నముక్క
పచ్చిమిర్చీలు
2
లవంగాలు
4
యాలుకలు
2
ఆనాసపూలు
2
షాజీర
కొంచం
మరాఠీ మొగ్గలు
2
బిర్యానీ ఆకులు
2
జాపత్రి
ఒక రెమ్మ
కొత్తిమీర తరుగు
1/4కప్పు
పుదీన
కొంచం
నూనె
6స్పూన్స్
How to prepare: 
ముందుగా నాటుకోడి మాంసాన్ని/Natukodi బాగా కడిగి నీళ్ళు లేకుండా పిండి, దానిలో కొంచం ఉప్పు, కారం, కొంచం అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, కొంచం పసుపు, నిమ్మరసం వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టాలి.
స్టౌ మీద కుక్కర్ పెట్టి కొంచం నూనె వేసి కాగాక కలిపి ఉంచిన చికెన్ వేసి కాసేపు పెద్ద మంట మీద వేయించుకుని , తరవాత కొంచం నీళ్ళు వేసి మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలను ముద్దలా చేసుకోవాలి.
ఎండుకొబ్బరిని, గసగసాలను కలిపి మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక అందులో చెక్క, లవంగాలు, షాజీర, అనాసపూలు, మరాఠీమొగ్గలు, బిర్యానీ ఆకులు, జాపత్రి, యాలుకలు వేసి వేయించుకోవాలి.
అవి వేగాక అందులో ఉల్లిపాయ ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముద్ద సగానికి పైగా వేగాక అందులో పసుపు, పచ్చిమిర్చి చీలికలు, కొంచం పుదీనా, కొంచం కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముద్ద బాగా వేగి ఎర్రగా వచ్చాక అందులో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
అది బాగా వేగాక అందులో చేసి ఉంచిన ఎండుకొబ్బరి, గసగసాల ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
బాగా వేగి నూనె బయటకు వచ్చేటప్పుడు అందులో రుచికిసరిపడ ఉప్పు, కారం, ధనియాలపొడి, జీర పొడి వేసి బాగా వేయించుకోవాలి.
నూనె బయటకు వచ్చేటప్పుడు అందులో ఒక అర కప్పు నీళ్ళు వేసి కలిపి గ్రేవీని మరిగించుకోవాలి.
గ్రేవీ మరిగేటప్పుడు అందులో ఉడికించి ఉంచుకున్న చికెన్ నీళ్ళతో సహా వేసి కలిపి మిగిలిన కొత్తిమీర, పుదీనా వేసి రుచి సరిచూసుకుని మూత పెట్టి ఒక పదినిమిషాలు ఉడికించాలి.
కూర కొంచం దగ్గర పడేటప్పుడు అందులో గరం మసాలా పొడి వేసి కలిపి మరలా ఒక 2నిమిషాలు ఉడికించుకొని దించాలి.