దహీవడ

దహీవడనే మన తెలుగువాళ్ళు 'పెరుగు'గారెలు అంటారు.గారెలంటేనే ఇష్టంలేనివారు ఉండరు.మళ్ళీ వాటిని 'పెరుగు'లో వేసుకుని తింటే ఆ రుచి ఎంతబాగుంటుందో చెప్పలేము.మన చిన్నప్పుడు అమ్మమ్మవాళ్ళు గారెలను 'పెరుగు'లో వేసి ఇచ్చేవారు.ఈ 'పెరుగు'గారెలను మన తెలుగువాళ్ళు అలానే చేస్తారు.కానీ నార్త్ ఇండియన్స్ వచ్చేసి కొంచం చాట్ మసాలాను కలిపి అందులో కొంచం చట్ పట రుచి వచ్చేటట్లు చేసేదే దహీవడ.

Total Time: 
15min
Preparation TIme: 
5min
Cooking Time: 
10min
Ingredients: 
మినపప్పు
1కప్పు
అల్లం
చిన్నముక్క
పెరుగు
1/2లీ
పచ్చిమిర్చి
5
ఉల్లిపాయలు
2
కరివేపాకు
2రెమ్మలు
కొత్తిమీర తరుగు
కొంచం
పసుపు
చిటికెడు
ఉప్పు
రుచికిసరిపడ
చాట్ మసాలా
1/2స్పూన్
సేవ్
కొంచం(ఇష్టమైతే)
జీర
1స్పూన్
పచ్చిశెనగపప్పు
1స్పూన్
మినపప్పు
1స్పూన్
ఎండుమిర్చి
1
ఆవాలు
కొంచం
నూనె
వడ చేసుకోవటానికి
How to prepare: 
వడలు చేసుకోవటానికి ముందుగా మినపప్పును నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
ఆ పిండిలో కొంచం అల్లం, 2పచ్చిమిర్చిలను దంచి చేసిన ముద్ద, కొంచం జీర, రుచికి సరిపడ ఉప్పు వేసి కలిపి బాగా కాగిన నూనెలో వడలుగా వేసి కాల్చుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
'పెరుగు'ను చిక్కగా చిలికి అందులో రుచికిసరిపడ ఉప్పు, చాట్ మసాలాపొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద చిన్న కడాయి పెట్టి అందులో 2స్పూన్స్ నూనె వేసి కాగనివ్వాలి.
కాగాక అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
అవి చిటపటమన్నాక అందులో పచ్చిశెనగపప్పు, మినపప్పు, జీర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
అవి వేగాక అందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి.
అవి కొంచం వేగాకా అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, చిటికెడు పసుపును చేర్చి ఒక 2నిమిషాలు వేయించుకుని చల్లార్చుకోవాలి.
చల్లారిన పోపును చిలికి ఉంచిన 'పెరుగు'లో వేసి కలిపి అందులో చేసిన వడలను వేయాలి.
సర్వ్ చేసేముందు ఇష్టమైన వాళ్ళకు పైన సేవ్(సన్న కార్పూస)ను చల్లి సర్వ్ చేయండి.