చెక్కర పొంగలి/chekkara pongali

చెక్కర పొంగలి/pongali అంటే ఆ శ్రీవారికి కూడా చాలా ఇష్టం అని ప్రతీతి.తిరుపతి వెళ్ళినా, ఏ వెంకన్న గుడికో వెళ్ళినా చెక్కర పొంగలి/pongali ప్రసాదం కోసం పిల్లలు, పెద్దలు ఆత్రంగా చూస్తారు.మీరు అదే రుచి వచ్చేలా చెక్కర పొంగలి/pongali చేసి పెడితే ఆ శ్రీవారు కూడా మిమ్మల్ని తప్పక కరుణిస్తారు.

Total Time: 
30min
Preparation TIme: 
10min
Cooking Time: 
20min
Ingredients: 
బియ్యం
1 కప్పు
పంచదార
2 కప్పులకు కొంచం తక్కువగా
పెసరపప్పు
1/4 కప్పు
యాలకులు
6
పచ్చ కర్పూరం
చిటికెడు కన్నా తక్కువ
నెయ్యి
3/4 కప్పు
ఎండుకొబ్బరి ముక్కలు
1/4 కప్పు
జీడిపప్పు
1/4 కప్పు
పాలు
1/2 లీ
How to prepare: 
స్టౌ మీద గిన్నె పెట్టి ఒక 2 కప్పుల నీళ్ళు పోసి కాగనివ్వాలి.
కొంచం కాగాక కడిగిన బియ్యం, పెసరపప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
సగానికి పైగా ఉడికాక పాలూ పోసి మరలా ఉడికించాలి.
అన్నం పూర్తిగా ఉడికాక అందులో పంచదార వేసి కలపాలి
మిక్సీ జార్ లో యాలకులు, పచ్చ కర్పూరం(ఈ కర్పూరం వంటలలో వాడేది బయట మార్కెట్ లో అడిగితే దొరుకుతుంది చాలా కొంచం వేయాలి లేకపోతే చేదు వస్తుంది), 2 స్పూన్స్ పంచదార వేసి మిక్సీ పట్టి అ పొడిని ఉడికే చెక్కర పొంగలి/pongali లో వేసి కలపాలి.
దగ్గర పడ్డక నేతిలో వేయించిన ఎండుకొబ్బరిముక్కలు, జీడిపప్పులు వేసి కలిపి ఆ వేడి వేడి నెయ్యి కూడా వేసి బాగా కలిపి స్టౌ ఆపి కొంచం చల్లారాక సర్వ్ చేయాలి.