గుత్తి దొండకాయ/Dondakaya Masala Curry

దొండకాయ/dondakayaతో కూర అనగానే అందరికి సాధారణంగా ఫ్రై ఒక్కటే బాగా తెలుసు.కానీ అలా ఫ్రై చేయాలంటే దొండకాయ/dondakayaలను కోయాలన్నా, వాటిని కొంచం నూనెలో చిన్నగా వేయించాలాన్నా మనకు ఎక్కువ సమయము కావాలి.అంత కన్నా ముందు మనకు చాలా ఓపిక కావాలి.ఇంతా చేస్తే కేజీ దొండకాయ/dondakayaలను తరిగి వండినా అవి ఫ్రై అయ్యాక కొంచం కూర అవుతుంది.పైగా ఇది రైస్లోకి లేదా సాంబారులోకి సైడ్ డిష్ లా మాత్రమే బాగుంటుంది.కానీ ఈ దొండకాయ/dondakaya మసాలా కూర చేయడానికి చాలా తక్కువ సమయము పడుతుంది అంతేకాక వేజిటేరియన్స్ కు వెజ్ పులావ్ లోకి ఇది మంచి కాంబినేషన్.అంతే కాక ఈ కూర చపాతీ, పుల్కాలలోకి కూడా చాలా బాగుంటుంది.దొండకాయ/dondakaya అంటే ఇష్టంలేని వాళ్ళు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు.ఒకసారి ట్రై చేసి చూడండి.

Total Time: 
15min
Preparation TIme: 
5min
Cooking Time: 
10min
Ingredients: 
దొండకాయలు/Dondakaya
1/2కేజీ
పల్లీలు
2స్పూన్స్
గసగసాలు
3స్పూన్స్
తెల్లనువ్వులు
2స్పూన్స్
అల్లం వెల్లుల్లి ముద్ద
1స్పూన్
ఉల్లిపాయలు
2(పెద్దవి)
ఆవాలు
కొంచం
జీర
కొంచం
షాజీర
కొంచం
బిర్యానీ ఆకు
1
పసుపు
చిటికెడు
ఉప్పు, కారం
రుచికిసరిపడ
ధనియాలపొడి
1స్పూన్
జీరాపొడి
1/2స్పూన్
గరం మసాలా పొడి
1/2స్పూన్
కొత్తిమీర
కొంచం
కరివేపాకు
2రెమ్మలు
నూనె
డీప్ ఫ్రైకి సరిపడా
How to prepare: 
స్టౌ మీద కడాయి పెట్టి అందులో పల్లీలు వేసి కాసేపు వేయించుకోవాలి.అవి సగానికి పైగా వేగాక అందులో తెల్లనువ్వులు, గసగసాలు వేసి చిన్న మంట మీద కాసేపు వేయించుకుని తీసి చల్లార్చుకుని మెత్తని ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
దొండకాయ/dondakayaలను గుత్తులుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
స్టౌ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగాక గుత్తులుగా కోసిన దొండకాయ/dondakayaలను వేసి బాగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో 2స్పూన్స్ నూనెను మాత్రమే ఉంచి అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
అవి చిటపటమన్నాక అందులో జీర, షాజీర, బిర్యాని ఆకు వేసి బాగా వేయించుకోవాలి.
అవి వేగాక అందులో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
అవి బాగా వేగాక అందులో చేసిన పల్లీలు, గసగసాలు, నువ్వుల ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
మసాలా బాగా వేగి నూనె బయటకు వచ్చేటప్పుడు అందులో పసుపు, రుచికిసరిపడ ఉప్పు, కారం, ధనియాలపొడి, జీరాపొడి వేసి బాగా వేయించుకోవాలి.
అవి బాగా వేగాక అందులో కొంచం నీళ్ళు వేసి బాగా కలిపి గ్రేవీని బాగా మరగనివ్వాలి.
కూర ఉడికేటప్పుడు అందులో వేయించి ఉంచుకున్న దొండకాయ/dondakayaలను వేసి కలిపి, మూత పెట్టి ఒక 6నిమిషాలు ఉడికించుకోవాలి.
కూర కొంచం దగ్గర పడేటప్పుడు అందులో గరం మసాలపొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి దించాలి.
మీకు నచ్చిన ఏదన్న ఫ్లేవర్డ్ రైస్తో కానీ పుల్కా, చపాతీతో సర్వ్ చేయండి.