క్యాబేజీ టమాట పచ్చడి/Cabbage Tomato pachchadi

క్యాబేజి/cabbage కూరలో ఎన్ని మసాలాలు వేసి వండినా కూడా ఎంతో కొంత దానీ వాసన మాత్రం వస్తూనే ఉంటుంది.కానీ మీరు ఇలా టమాటాతో కలిపి పచ్చడి చేసి చూడండి, అసలు అందులో క్యాబేజీ/cabbage ఉంది అన్న విషయం మనము చెబితే తప్పితే తెలియదు.వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని, ఈ పచ్చడి కలుపుకుని తింటే, క్యాబేజీ/cabbage అంటే ఇష్టపడనివాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

Total Time: 
12min
Preparation TIme: 
2min
Cooking Time: 
10min
Ingredients: 
క్యాబేజీ తరుగు/cabbage
1కప్పు(100గ్రా)
టమాటాలు
2
పచ్చిమిర్చి
6
ఎండుమిర్చి
2
ధనియాలు
1స్పూన్
చింతపండు
కొంచం
ఉప్పు
రుచికిసరిపడ
జీర
1స్పూన్
వెల్లుల్లి రెబ్బలు
10
కరివేపాకు
2రెమ్మలు
కొత్తిమీర తరుగు
కొంచం
పసుపు
చిటికెడు
పచ్చిశెనగపప్పు
1స్పూన్
మినపప్పు
1స్పూన్
ఆవాలు
1/4స్పూన్
ఇంగువ
చిటికెడు
నూనె
2స్పూన్స్
How to prepare: 
స్టౌ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కాగాక అందులో ఎండుమిర్చి, ధనియాలు, కొన్ని వెల్లుల్లిరెబ్బలు, చింతపండు, కొంచం జీర, కొంచం కరివేపాకు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో క్యాబీజీ/cabbage తరుగు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుంటూ మగ్గించుకోవాలి.
చల్లారిన ఎండుమిర్చీలను మొదట మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి.
అవి నలిగాక మగ్గించుకుని చల్లార్చుకున్న క్యాబేజీ/cabbage, టమాటా ముక్కలను వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసి పచ్చడిని చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి కాగాక అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
అవి చిటపటమన్నాక అందులో పచ్చిశెనగపప్పు, మినపప్పు, జీర, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
అవి వేగాక అందులో చిటికెడు ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలిపి, ఈ పోపును చేసిన పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేయాలి.