క్యాప్సికం ఉల్లి పచ్చడి

సాధారణంగా క్యాప్సికం కొంచం తియ్యగాను, లైట్ పెప్పెర్ ఫ్లేవర్ తో ఎక్కువగా సలాడ్స్ లోకి బాగుంటుంది.దానిని ఎక్కువగా ఉడికించిన దాని రుచి అంత బాగుండదు.ఎప్పుడైనా సరే క్యాప్సికం ను మైల్డ్ గా వండుకుని తింటేనే చాలా బాగుంటుంది.మేము క్యాప్సికం తో పచ్చడి చేయాలని చాలా రకాలుగా ట్రై చేసాము.చివరికి ఎప్పుడు చెప్పే స్టైల్ లో చేస్తే చాలా బాగుంటుంది.ఈ పచ్చడి చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ క్యాప్సికం తియ్యటి కూరగాయ కనుక ఉప్పు, కారాలు కొంచం ఎక్కువ పడతాయి.

Total Time: 
15min
Preparation TIme: 
5min
Cooking Time: 
10min
Ingredients: 
గ్రీన్ క్యాప్సికం
2
టమాట
1పెద్దది
ఉల్లిపాయ
1పెద్దది
ఉప్పు
రుచికి సరిపడ
పచ్చిమిర్చి
8
ఎండుమిర్చి
4
వెల్లుల్లి రెబ్బలు
7
ధనియాలు
1స్పూన్
పచ్చిశెనగపప్పు
2స్పూన్స్
మినపప్పు
2స్పూన్స్
ఆవాలు
1/4స్పూన్
జీర
1స్పూన్
ఇంగువ
చిటికెడు
పసుపు
చిటికెడు
చింతపండు
కొంచం
కరివేపాకు
2రెమ్మలు
కొత్తిమీర తరుగు
కొంచం
నూనె
2స్పూన్స్
How to prepare: 
స్టౌ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి అందులో ఎండుమిర్చి, ధనియాలు, ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొంచం జీర, వెల్లుల్లి రబ్బలు కొన్ని, కొంచం కరివేపాకు, చిటికెడు ఇంగువ, చింతపండు వేసి బాగా వేయించుకోవాలి.
అవి వేగాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నూనెలో క్యాప్సికం ముక్కలు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి చిటికెడు పసుపు చేర్చి బాగా వేయించుకుని చల్లార్చుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చిల మిశ్రమం వేసి బాగా పొడిలా చేసుకోవాలి.అవి పొడి అయ్యాక అందులో చల్లారిన క్యాప్సికం టమాట పచ్చిమిర్చిలను వేసి రుచికి సరిపడ ఉప్పును చేర్చి మిక్సీ చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద మరలా కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కాగాక అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
అవి చిటపటమన్నాక అందులో ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొంచం జీర వేసి బాగా వేయించుకోవాలి.
అవి వేగాక అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలిపి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2నిమిషాలు వేయించుకోవాలి.
ఈ చేసిన పోపును చేసిన పచ్చడిలో వేసి కలిపి వేడివేడి అన్నంతో సర్వ్ చేయండి.