కొత్తిమీర పచ్చడి/kottimeera pachadi

కొత్తిమీర/kottimeera/coriandarతో చాలామంది పచ్చడి చేస్తారు.అందులో రకరకాలుగా. పచ్చిమిర్చితో, ఎండుమిర్చితో, కారంతో, పండుమిరపకాయలతో.ఏది వేసి చేసినా ఈ పచ్చడి చాలా రుచిగా బాగుంటుంది.ఇక్కడ మేము మీకు ఎండుమిర్చి, ధనియాలు కలిపి చేసిన రోటి పచ్చడి చెబుతున్నాము.ఇది ఒక వారం వరకు నిలువ కూడా ఉంటుంది.ఈ పచ్చడి దోశెలలోకి, ఇడ్లీలలోకి కూడా బాగుంటుంది. ఈ పచ్చడిలో పోపుకు కొంచం ఎక్కువ నూనె వాడాలి.పచ్చడిలో కలిపినప్పుడు ఆ రుచి బాగుంటుంది.

Total Time: 
10min
Cooking Time: 
10min
Ingredients: 
కొత్తిమీర/kottimeera/coriandar
పెద్దకట్ట
ఎండుమిర్చి
5 లేక 6
ధనియాలు
1స్పూన్
మెంతులు
5
జీర
1స్పూన్
వెల్లుల్లి రెబ్బలు
10
కరివేపాకు
2రెమ్మలు
పసుపు
చిటికెడు
ఇంగువ
చిటికెడు
చింతపండు
కొంచం
ఉప్పు
రుచికిసరిపడ
నూనె
4స్పూన్స్
పచ్చిశెనగపప్పు
1స్పూన్
మినపప్పు
1స్పూన్
ఆవాలు
1/4స్పూన్
How to prepare: 
స్టౌ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి కాగాక అందులో ఎండుమిర్చి, ధనియాలు, కొంచం జీర, మెంతులు, చింతపండు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి.
అదే కడాయిలో కడిగి శుభ్రం చేసిన కొత్తిమీర/kottimeera/coriandar తరుగు వేసి కాసేపు మగ్గించుకోవాలి.ఆకులో ఉన్న నీరు వెళ్ళేవరకు వేయించుకోవాలి.
మిక్సీ జార్ లో వేయించుకున్న ఎండుమిర్చి ధనియాల మిశ్రమం వేసి దాంట్లో రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు వేసి పొడిలా చేసుకోవాలి.
అవి పొడి అయ్యాక అందులో వేయించుకున్న కొత్తిమీర/kottimeera/coriandarను వేసి అవసరమైతే కొంచం నీళ్ళు వేసి పచ్చడిలా చేసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి పోపుకు సరిపడా నూనె వేసి కాగాక అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
అవి చిటపటమన్నాక అందులో పచ్చిశెనగపప్పు, మినపప్పు, కొంచం జీర వేసి వేయించుకోవాలి.
అవి వేగాక అందులో చిటికెడు ఇంగువ, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కలిపి చేసిన కొత్తిమీర/kottimeera/coriandarపచ్చడిలో వేసి కలపాలి.