కాజాలు

మైదాపిండితో రకరకాల స్వీట్స్ చేయవచ్చు.ముఖ్యంగా అందరికి ఇష్టమైన కాజాలు.వీటిలో చాలా రకాలు ఉన్నాయి మడతకాజ, పనసతొనలని.వీటిని తరవాత నేర్చుకుందాం.మా చిన్నప్పుడు అమ్మ వీటిని చేసి అణాసీట్లు చేసాను తినండి అనేది.కొంతమంది డైమండ్ కట్స్ అని కూడా అంటారు.చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు వీటిని.కొంతమంది వీటిని నూనెలో వేయించి పంచదారపొడి చల్లుకుంటారు కానీ పాకం పడితే ఇవి 10రోజుల వరకు నిలువ ఉంటాయి.

Total Time: 
25min
Preparation TIme: 
10min
Cooking Time: 
15min
Ingredients: 
మైదాపిండి
1/2కేజీ
పంచదార
400గ్రాములు
యాలకలపొడి
2స్పూన్స్
నెయ్యి
3స్పూన్స్
నూనె
డీప్ ఫ్రైకి సరిపడ
How to prepare: 
మైదాపిండిని జల్లేడతో జల్లించి అందులో నెయ్యి వేసి ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకుని తగిన్నన్ని నీళ్ళు వేసి చపాతీ పిండిలా కలుపుకుని ఒక గంట మూత పెట్టి నాననివ్వాలి.
ఒక గంట తరవాత కలిపిన పిండిలోంచి ఒక చిన్న ముద్ద తీసుకుని చపాతీలా ఒత్తి చాకు తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాగే నూనెలో వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి
స్టౌ మీద వేరే గిన్నె పెట్టి అందులో పంచదార, చాలా కొంచం నీళ్ళు వేసి పాకం పట్టుకోవాలి.
మరిగే పంచదార పాకం చల్లటి నీళ్ళలో వేస్తే అది కొంచం ఉండలా రావాలి.అప్పటివరకు పాకాన్ని ఉడికించుకోవాలి.
ఉడికిన పాకంలో యాలకలపొడి వేసి కలిపి దానిని వేయించుకున్న కాజాలలో వేసి అన్నింటికీ పట్టేలా బాగా కలపాలి.
ఒక 4నిమిషాలు నిదానంగా తిప్పుతూ ఉంటే అవి పొడిపొడిలాడిపోతాయి.వాటిని డబ్బాలో భధ్రపరిస్తే కరకరలాడుతూ తియ్యగా వారం రోజులు నిలువ ఉంటాయి.