What A Jump త్రిష....

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష‌కి ఈ మధ్య సరైన అవకాశాలు దక్కడం లేదు. దీంతో ఈ చెన్నై చిన్నది విదేశాల్లో చక్కర్లు కొడుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేసే పనిలో పడింది. తాజాగా కెనడాకి వెళ్లిన త్రిష అక్కడ 1,168 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జంప్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు గాల్లోనే ఉండి.. కింద స్టేడియంలో జరుగుతున్న బేస్‌బాల్‌ మ్యాచ్‌ని వీక్షించడం మధురానుభూతని చెప్పుకొచ్చింది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని అగ్రహీరోలతో ఆడిపాడిన ఈ భామ.. ప్రస్తుతం హారర్, లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది. దాదాపు పదేళ్లపాటు సినిమాలతో బిజీబిజీగా గడిపిన త్రిష ఇప్పుడు దొరికిన ఈ విరామ అవకాశాన్ని ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. కెనడా‌లో బంగీ జంప్‌ సమయంలో తానే స్వయంగా తీసిన కొన్ని ఫొటోల్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా త్రిష పంచుకుని ఆనందం వ్యక్తం చేసింది.