100కోట్లతో బాబు స్థానిక సంస్థలను కొన్నారు

తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా తెదేపానే విజయం సాధించింది. దాంతో బాబు వర్గం మొత్తం కూడా అమితానందంతో పండగ చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆరోపణలు చేశాడు వైకాపా ప్రధాన కార్యదిర్శ భూమన కరుణాకరన్‌ రెడ్డి. గతంలో బాబు ఎమ్మెల్యేలను కొన్నట్టుగానే తాజాగా ఎమ్మెల్సీలను కూడా కొన్నాడు. వందకోట్లను ఖర్చు చేసి మరి స్థానిక సంస్థలను కొని అన్ని చోట్ల విజయం సాధించాడు అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాప్రతినిధులను డబ్బుతో కొంటూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అని బాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన జరుగుతోంది, అయినా ఆయన కాలం చెల్లడానికి సమయం ఆసన్నం అయ్యింది. వచ్చే ఎన్నికల్లో బాబుకు ప్రజలే బుద్ది చెబుతారు అంటూ భూమన చంద్రబాబు నాయుడిపై నిప్పులు కురిపించారు. మరోవైపు వైకాపా కీలక నేతలు కూడా ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయారు. మొత్తానికి ఏపీ మొత్తం కూడా పచ్చజెండా హవానే సాగుతుంది. గుండెధైర్యం కోసం వైకాపా నేతలు సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు కానీ ప్రజలు వైకాపాను పట్టించుకోవడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు.