‘చిత్రాంగద’ రివ్యూ

చిత్రం : చిత్రాంగద
రేటింగ్‌ : 2.5/5.0
బ్యానర్‌ : శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా
సంగీతం : సునీల్‌ కశ్యప్‌
దర్శకుడు : అశోక్‌
నిర్మాత : శ్రీధర్‌, రెహమాన్‌
విడుదల : మార్చి 10, 2017

స్టారింగ్‌ : అంజలి, దీపక్‌, సాక్షి గులాటి, సింధు తులానీ, సప్తగిరి తదితరులు

తెలుగమ్మాయి అయిన అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతూ ఉంది. భారీ స్థాయిలో క్రేజ్‌ను దక్కించుకున్న అంజలి తెలుగులో కూడా వరుస చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంటుంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు పెట్టింది పేరుగా అంజలి నిలుస్తుంది. మరి అంజలి నటించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథలోకి వెళితే :
సైకాజీలో పి.హెచ్‌డీ చేసిన చిత్ర(అంజలి) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా జాబ్‌ చేస్తుంటుంది. ఒక లేడీస్‌ హాస్టల్‌లో చిత్ర ఉంటూ జాబ్‌ చేస్తుంది. ఆ సమయంలో లేడీస్‌ హాస్టల్‌లోని అమ్మాయిలతో చిత్ర ఒక అబ్బాయిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో అమ్మాయిలు అంతా కూడా చిత్రపై ఫిర్యాదు చేస్తారు. ఇంతకు చిత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? చిత్ర ఒక చనిపోయిన వ్యక్తి గురించి చెబుతూ ఉంటుంది. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? అనేది సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌ :
అంజలి నటన చాలా బాగుంది. రెండు విభిన్న వేరియేషన్స్‌తో నటించి ఆకట్టుకుంది. ఎమోషనల్‌ సీన్స్‌ మరియు కొన్ని హర్రర్‌ సీన్స్‌లలో అంజలి ఆకట్టుకుంది. పలు సీన్స్‌లలో అంజలి నటన సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. సప్తగిరి కామెడీ చాలా సాదాసీదాగా ఉంది. మిగిలిన వారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

సాంకేతికపరంగా:
పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విధంగా లేవు. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుంది. పలు సీన్స్‌ను హైలైట్‌ చేసే విధంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని హర్రర్‌ సీన్స్‌లలో సినిమాటోగ్రఫీతోనే ప్రేక్షకులను భయపెట్టారు. ఎడిటింగ్‌లో లోపాలున్నాయి. పలు సీన్స్‌ను డ్రాగ్‌ చేసినట్లుగా ఉన్నాయి. ఇక దర్శకుడు అశోక్‌ స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వంపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని డైలాగ్స్‌ బాగున్నాయి. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:
పిల్లజమీందార్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అశోక్‌ మరో విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ కాన్సెప్ట్‌ను మంచి కథగా మల్చడంతో పాటు, మంచి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విఫలం అయ్యాడు. స్క్రీన్‌ప్లేకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలిపితే బాగుండేది. చిత్రాంగదగా అంజలి నటన అదిరిందని చెప్పాలి. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించింది. అన్ని సీన్స్‌లలో కూడా అంజలి ఆకట్టుకుంది. మొత్తంగా చూస్తే చిత్రాంగద ఒక సాదాసీదా హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంది.

నచ్చినవి:
అంజలి,
సినిమాటోగ్రఫీ,
కాన్సెప్ట్‌

నచ్చనివి :
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం,
ఎడిటింగ్‌,
కామెడీ

చివరగా :
చిత్రాంగద ఒక మోస్తరు ఎంటర్‌టైనర్‌.