‘కాటమరాయుడు’ విడుదల కొత్త పోస్టర్‌

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం ఈ నెల 24 ప్రేక్షకుల ముందుకు రానుంది. డాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్‌ సరసన శృతిహాసన్‌ రొమాన్స్‌ చేసింది.

ఈ చిత్రంలో పవన్‌ లుక్‌ను చూస్తుంటేనే సినిమాని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా..?? అనే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ చిత్ర పాటలకు, టీజర్‌కు మంచి స్పందన రావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్ర విడుదల తేదీతో చిత్ర యూనిట్‌ తాజాగా ఓ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. విడుదల పోస్టర్‌లో కూడా పవన్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండి ఆకట్టుకుంటున్నాడు.