​లోకేష్ నోరు జారారు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ బాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా చేసిన ప్రసంగంలో దొర్లిన పొరపాటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో లోకేష్ బాబు మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయబోయి, ‘అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు..’ అని వ్యాఖ్యానించారు. జయంతి రోజును.. ‘వర్ధంతి..’ అని అన్నారు లోకేష్.

మరి వేరే ఎవరైనా ఇలాంటి పొరపాటు చేసి ఉంటే అది పెద్దగా పట్టించుకునే అంశం కాదేమో కానీ.. లోకేష్ బాబు కాబట్టి అందరి కళ్లూ ఆయన మీదే ఉంటాయి. అందులోనూ నూతనంగా మంత్రి బాధ్యతలు కూడా స్వీకరించారు కదా.. ఇంతకు ముందు కూడా లోకేష్ ప్రసంగాల్లో కొన్ని కొన్ని తప్పులు దొర్లాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంలో లోకేష్ ప్రసంగం కూడా వాటి సరసనే చేరింది.