"స్పైడర్" సినిమా రివ్యూ

చిత్రం:స్పైడర్
రేటింగ్:3.0/5.0
సంగీతం : హరీష్ జయరాజ్
దర్శకత్వం : మురుగదాస్
బ్యానర్:ఎల్‌ఎల్‌పి పతాకం
నిర్మాతలు: ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌

స్టారింగ్ : మహేష్ బాబు,రకుల్ ప్రీతి సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు…

మహేష్ సినిమా విడుదల అవుతోంది అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎంతో ఉత్కంఠ. బ్రమ్మోత్సవం తరవత మళ్ళీ ఇన్నాళ్ళకు మహేష్ సినిమా రావడం అందులోను మురగాదాస్ దర్శకత్వంలో, ఒకేసారి తెలుగు, తమిళ, అరబిక్ బాషలలోను ఈ రోజే విడుదల అవడంతో ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మురుగదాస్ సినిమాల్లో డైరెక్ట్‌ మెసేజ్‌ లేక ఇన్‌డైరెక్ట్‌ మెసేజ్‌లుంటాయి. స్పైడర్‌లో కూడా హ్యుమానిటీకి సంబంధించిన మెసేజ్‌తో ఉంటుంది. మనిషిలో హ్యుమానిటీ తగ్గిపోయినప్పుడు సోసైటీలో లంచం పెరిగిపోతుంది లేదా మరేదైనా వైపరీత్యం సంభవిస్తుంది.ఈ మెసేజ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ప్రేక్షకులకు చూపించారు. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథలోకివెళితే...
శ్మశానంలో పుట్టిన భైరవుడికి చావు చూడడం అంటే సరదా, అవతలి వ్యక్తుల ఏడుపులో తన సంతోషాన్ని చూసుకుంటాడు భైరవుడు(ఎస్ జె సూర్య). కరుడుగట్టిన ఈ క్రిమినల్ మారణకాండ సృష్టిస్తుంటాడు. అతని తమ్ముడు కూడా అదే దారిలో ఉంటాడు. వాళ్ళు బాల్యం అందుకు కారణం అవుతుంది. శివ(మహేష్ బాబు) ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తుంటాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు కష్టంలో ఉన్నా తెలుసుకొని వారికి సహాయం చేస్తుంటాడు. అదే సమయంలో భైరవుడు చేసే మారణకాండను తెలుసుకుని, అతడిని పట్టుకోవడానికి శివ బయలదేరతాడు. అతడిని పట్టుకునే ప్రయత్నంలో శివ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? భైరవుడు సైకోగా మారడానికి గల కారణాలు ఏంటి? చివరకి భైరవుడు ఏమవుతాడు? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
మహేష్ బాబు లాంటి నటుడిని హీరోగా పెట్టడం వలన ఎస్.జె.సూర్య ఫర్ఫార్మెన్స్ కాస్త తగ్గిందేమో కానీ, అక్కడ మరో హీరో గనుక ఉంటే, సూర్య ముందు నిలవలేకపోయేవారు. నిజంగానే సైకో అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఒదిగిపోయాడు. మహేష్ బాబు తన లుక్స్, నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. హీరో, విలన్ మధ్య సన్నివేశాలు, సంభాషణలు సినిమా స్థాయిని పెంచేశాయి. క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రకుల్ పాత్ర పాటల వరకు మాత్రమే పరిమితమైంది.

సాంకేతికపరంగా...
మురుగదాస్ ఒక్కరు. తన ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక మంచి విషయం అంతర్లీనంగా చెప్పడానికి ప్రయత్నించే మురుగదాస్ ఈ సినిమాకి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. మురుగదాస్ చెప్పే కధల్లో కేవలం ఓ సమస్యని హైలైట్ చేయకుండా వాటికి పరిష్కారాలు కూడా చూపిస్తారు.
దానికి ఈ సినిమా ఏమీ మినహాఇంపు కాదు. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ...
ఈ వేగవంతమైన యుగంలో మనం కూడా వేగంగానే ఉండాలి, కానీ అదే సమయంలో మానవత్వాన్ని మర్చిపోకూడదనే విషయాన్ని దర్శకుడు మురుగదాస్ ‘స్పైడర్’ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.ప్రజలను తన పైశాచిక ఆనందం కోసం చంపే ఓ సైకో, అతడిని అడ్డుకొని ప్రజలను కాపాడాలని చూసే ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఈ ఇద్దరి చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ముఖ్యంగా విలన్ బ్యాక్ స్టోరీని ప్రెజంట్ చేసిన తీరు అద్భుతం. విలన్ ఎంట్రీ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మొత్తానికి మళ్ళీ మహేష్ ఈ సినిమాతో మంచి హిట్ కొత్తనట్లే.

నచ్చినవి...
మహేష్ ,సూర్య నటన
మురుగదాస్ దర్శకత్వం
ఫోటోగ్రఫీ
సంగీతం

నచ్చనివి...
సెకండ్ హాఫ్ ఎడిటింగ్

చివరగా...
ఈ "స్పైడర్" మంచి "స్పై"