సెరేనా విలియమ్స్ తల్లి కాబోతోంది

అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరేనా విలియమ్స్ తల్లి కాబోతోంది. దశాబ్దాలుగా లాన్ టెన్నిస్ లో తన ఆటతీరు లెక్కలేనన్ని ట్రోఫీలను, బోలెడంత మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న సెరేనా తను గర్భవతిని అనే విషయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. తను 20 వారాలా ప్రెగ్నెంట్ అని ఆమె ట్విటర్ పోస్టులో వివరించింది. ఈ మేరకు ఆమె ప్రకటించడంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యతో పాటు అభిమానులంతా శుభాకాంక్షలు తెలిపారు.

విశేషం ఏమిటంటే.. సెరేనాకు ఇంకా పెళ్లి కాలేదు. 35 యేళ్ల వయసున్న ఆమె సహజీవనంతో తల్లి కాబోతోందని సమాచారం. రెడిట్ వ్యవస్థాపకుడు అలెక్సిన్ ఒహానియన్ తో సహజీవనంలో ఉంది సెరేనా. కొన్నాళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తను తల్లి కాబోతున్న విషయాన్ని ఆమె ప్రకటించింది. తద్వారా వివాహ నిమిత్తం లేకుండా తల్లి కాబోతున్న సెలబ్రిటీగా ఈమె నిలుస్తోంది. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత సెరేనా తన ట్వీట్లను డిలీట్ చేసింది.