సూపర్‌స్టార్‌ డాక్టర్‌ ప్రేయసి లుక్స్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం మురుగదాస్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. అందువల్ల ఫస్ట్‌లుక్‌ కూడా ఇంకా విడుదల కాలేదు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రొమాన్స్‌ చేస్తోంది. సాదారణంగా మురుగదాస్‌ హీరోలను బాగా చూపించి హీరోయిన్లను కేవలం గ్లామర్‌ కోసమే ఉపయోగిస్తాడు అనే టాక్‌ ఉంది. కానీ ఈ చిత్రంలో రకుల్‌కు కూడా మంచి పాత్రనే ఉందట.

ఈ చిత్రంలో రకుల్‌ డాక్టర్‌ పాత్రను పోషిస్తుందని, మహేష్‌ డాక్టర్‌తో రొమాన్స్‌ చేయనున్నాడనేది అందరికి తెల్సిందే. మోడ్రన్‌గా కనిపించే రకుల్‌ డాక్టర్‌గా ఎలా ఉంటుందా అని అందరికి ఆసక్తి ఉండేది. తాజాగా ఆ డాక్టర్‌ స్టిల్స్‌ కొన్ని నెట్‌లో దర్శణం ఇచ్చాయి. డాక్టర్‌ లుక్‌లో రకుల్‌ సిత్రాలు కొన్ని తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక డాక్టర్‌ పాత్రలో కూడా రకుల్‌ చాలా క్యూట్‌ క్యూట్‌గా కనిపిస్తోంది. సూపర్‌స్టార్‌ డాక్టర్‌ ప్రేయసి రకుల్‌ స్టిల్స్‌ మీకోసం...