సుప్రీం కోర్టులో అద్వానీకి ఎదురుదెబ్బ !!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌.కె అద్వానీకి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్‌ జోషి సహా 16 మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయంస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానీతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈకేసులో 13 మంది బీజేపీ సీనియర్‌ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీం కోర్టు, రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. బాబ్రీ కేసు 25 ఏళ్లు ఎండింగ్‌లో ఉండడం న్యాయాన్ని నిరాకరించడమే అని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అందుకే రోజువారీ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులు చాలా మంది మరణించారని, మరికొంతమంది జీవిత చరమాంకంఓ ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది. రాయ్‌బరేలి కోర్టు నుంచి విచారణకు లక్నో ట్రయిల్‌ కోర్టు బదిలీకి అనుమతి ఇస్తూ రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు విచారణ పూర్తయ్యేవరకు జడ్జిలను బదిలీ చేయరాదని సూచించింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో అద్వానీ, జోషీలతోపాటు కేంద్ర మంత్రి ఉమా భారతి, వినయ్‌ కటియార్‌, అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్తాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. అయితే కల్యాణ్‌సింగ్‌కు మాత్రం తాత్కాలిక ఊరట లభించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున తర్వాత విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు సూచనలు చేసింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నాఉ. 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు.ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. కరసేవకులపైన ఒక కేసు, మసీదు కూల్చివేతకు ప్రేరేపించారని నాయకులపై మరో కేసు నమోదు చేశారు. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్‌ హైకోర్టు కూడా తీర్పును సమర్థించింది. దీంత సీబీఐ ఈ తీర ఉ్పను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.