సిగ్గుతో తలదించుకున్న ఎమ్మెల్సీ!!

గీతం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులైన మూర్తి, తన విద్యాసంస్థ ప్రతిష్ట పెంచుకునేందుకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని ‘దెయ్యాల కొంప’గా అభివర్ణించిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మహానాడు నిండు సభలో సిగ్గుతో తలదించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సభాముఖంగా తన వ్యాఖ్యలకు మూర్తి క్షమాపణలు చెప్పారు. ఉన్నత స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నానని, తన తప్పునకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానన్నారు.ఆదివారం ఏయూ గ్రౌండ్స్‌లో జరిగిన మహానాడు సభలో మైకందుకున్న మూర్తి.. ఏయూ తనకు కన్నతల్లి వంటిదని, తనకు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన విషయంగా ఏయూ వర్గాలు పరిగణించాలని కోరారు. తన వ్యాఖ్యలపై ఏయూ వీసీతో పాటు ఉద్యోగులు, విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.