"సప్తగిరి ఎల్.ఎల్.బి"సినిమా రివ్యూ

చిత్రం: సప్తగిరి ఎల్.ఎల్.బి
రేటింగ్: 2.0/5.0
సంగీతం : బుల్గానిన్
దర్శకత్వం : చరణ్ లక్కాకుల
నిర్మాత: రవి కిరణ్

స్టారింగ్ :సప్తగిరి , కశిష్ వోహ్ర , సాయి కుమార్ , షకలక శంకర్ తదితరులు...

సప్తగిరి ళ్ళ్భ్ మూవీని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన జాలీ ళ్ళ్భ్ సిన్మాకు రీమేక్చే. అక్షయ్ కుమార్ ఆ మూవీ ద్వార మంచి పేరు కూడా సంపాదించారు. జాలీ ళ్ళ్భ్ మూవీ ఇప్పుడు తెలుగులో సప్తగిరి ళ్ళ్భ్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సప్తగిరి ళ్ళ్భ్ సినిమా మరీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక్కసారి రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథలోకివెళితే...
సప్తగిరి పుంగనూరులో ‘లా’ చదువు పూర్తిచేసి త‌న మ‌ర‌ద‌లు చిట్టి (క‌శిష్ వోరా) ని పెళ్లి చేసుకోవటానికి సిటీకి వెళ్లి మంచి పేరు, డ‌బ్బు సంపాదించడానికి సిటీకి వస్తాడు. బాగా అనుభవం సంపాదించి లాయర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి రాజ్‌పాల్(సాయి కుమార్) అనే సీనియర్ మోస్ట్ లాయర్ తారసపడతాడు. కోర్టులో రాజ్‌పాల్ వాదనలు విన్న సప్తగిరి ఆయనకి అభిమాని అయిపోతాడు. అలాంటి తరుణంలో ఒక యాక్సిడెంట్‌ కేసులో ఎంతోమంది ప్రాణాలను తీసి నిందితుడిగా ఉన్న వ్యక్తిని రక్షిస్తాడు ఒక ప్రముఖ నేర న్యాయవాది రాజ్ పాల్. ఈ విషయం తెలిసిన సప్తగిరి రాజ్ పాల్ కి వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఒక పిల్ ను ఫైల్ చేయాలని నిర్ణయించుకుంటాడు సప్తగిరి. అతను కేసు నమోదుచేయటం వలన సప్తగిరికి కలిగిన ఇబ్బందులు ఏంటి? ఆ ఇబ్బందులను సప్తగిరి ఎలా అదిగమించాడు? అత‌ను చేసిన యాక్సిడెంట్‌లో చ‌నిపోయింది ఎవ‌రు? అతను తన మిషన్లో ఎలా విజయం సాధించాడనేది ఈ కథ.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
టైటిల్ పాత్రను పోషించిన సప్తగిరి, తన పాత్రకు మంచి ప్రదర్శనలను అందించారు, సప్తగిరి నటన ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. కశిష్ వోహ్ర పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సాయి కుమార్, కోర్టుకు జ‌డ్జి (శివ‌ప్ర‌సాద్‌), షకలక శంకర్ మరియు ప్రభాస్ శ్రీను తమ పాత్రలకు న్యాయం చేశారు. సప్తగిరి మరియు షకలక శంకర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తాయి. సప్తగిరి కశిష్ వోహ్ర రొమాన్స్ ట్రాక్ బాగుంది. గొల్ల‌పూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం స‌హా త‌దిత‌రులు చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతికపరంగా...
కెమెరా వర్క్, ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తాయి. సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ...
సినిమా మొత్తం ఒక కేసు చుట్టూనే తిరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్ మీద పడుకున్న కొందరిపైకి ఎక్కించేస్తాడు. డబ్బు కోసం ఒక ప్రముఖ లాయర్ ఆ కేసును క్లోజ్ చేయిస్తాడు. అదే కేసుని తిరిగి రీఓపెన్ చేయించి వాదించి చనిపోయిన వారికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు హీరో. ఈ క్రమంలో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయాలను చాలా థ్రిల్లింగ్‌గా చూపించాల్సింది. కానీ సినిమాలో అది లోపించింది అని చెప్పవచ్చు.

నచ్చినవి...
హీరో నటన
కోర్టు సీన్‌

నచ్చనివి...
స్లోనెరేషన్

చివరగా...
ఓ సాధారణ చిత్రం