సంకటహర గణపతి స్తోత్రం

ఈ సంకటహార గణపతి స్తోత్రం పేరులోనే మనకు తెలిసిపోతుంది, ఈ గణపతి స్తోత్రం రోజు చదివితే మీకు మీ జీవితాలలో వచ్చే అన్ని విఘ్నాలు తొలిగి అంతటా జయమే లభిస్తుంది.

మీరు చేయదల్చుకున్న కార్యం మనసులో అనుకుని నిష్టగా ప్రతిరోజు ఈ గణపతి స్తోత్రం చదవండి. మీ కోరిక తప్పకుండా నేరవేరడమే కాక, మీకు తెలికుండా మీ జాతకంలో ఏవన్నా దోషాలు ఉన్నా అవి, ముఖ్యంగా రాహు, కేతు గ్రహ ప్రభావాల నుండి కూడా కాపాడపడతారు.

ప్రణమ్య శిరసా దేవం గోరీపుత్రం వినాయకం
భక్తావ ఆసం స్మరేన్నిత్యమాయుః కామార్ధసిద్ధయే
ప్రధమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశమంతు గజాననం
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యపఠేన్నిరః
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్ధీ లభతే విద్యాం ధనార్ధీ లభతే ధనం
పుత్రార్ధీ లభతే పుత్రాన్ మోక్షార్తీ లభతే గతిం
జపేత్ గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః!!!