శ్రియా భూపాల్ పెళ్ళి అయిపోయింది

శ్రియా భూపాల్ ఎవరా అని ఆలోచిస్తున్నారా?? అదేనండి 2016లో అఖిల్ అక్కినేనితో శ్రియా భూపాల్‌కు వైభవంగా నిశ్చితార్థం జరగడం, అనంతరం కొద్ది కాలానికే వారి పెళ్లి రద్దవడం చర్చనీయంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్ వరస సినిమాలు చేస్తూ బిజీ అవ్వగా, శ్రియా భూపాల్, అనిందిత్‌తో పెళ్లికి సిద్ధమైంది. అనిందిత్, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనవడు కావడం గమనార్హం. మరియు రాంచరణ్ సతీమణి ఉపాసనకు అనిందిత్ వరసకు తమ్ముడు అవుతారు.

శ్రియా భూపాల్, అనిందిత్ రెడ్డి వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం (జులై 6) రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో అతిరథ మహారథుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి బంధం ద్వారా ఒక్కటవనున్నారు. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన సంగీత్ ఉత్సవంలో ఇప్పటికే పలువురు తారలు, సెలబ్రిటీలు సందడి చేశారు. విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, నాగ చైతన్య - సమంత పెళ్లిలలో అద్భుతమైన ఫొటోలు తీసిన జోసెఫ్ రాధిక్, శ్రియా - అనిందిత్ వివాహానికి కూడా ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శ్రియా - అనిందిత్ వివాహానికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేశారు.

స్వతాహాగా ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియా, మెడలో డైమండ్ నెక్లెస్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సంప్రదాయ దుస్తులతో అనిందిత్ ఆకట్టుకుంటున్నాడు. జోసెఫ్ షేర్ చేసిన ఫొటో చూపరులను ఆకట్టుకునేవిధంగా ఉంది.