వైకాపాలోకి ‘బబర్ధస్త్‌’ కమెడియన్‌కు ఆహ్వానం

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతూ బాగా పాపులర్‌ అయిన కామెడీ షో ‘జబర్దస్త్‌’ ద్వారా చాలామంది కూడా ప్రేక్షకులకు సుపరిచితం అవుతున్నారు. ఈ షోకు రాకముందు వారు ఏం చేశారో కాని వచ్చాక మాత్రం తెగ పాపులర్‌ అవుతూ ఉన్నారు. ఇక ఆటోమేటిక్‌ పంచులను పేలుస్తూ ఫుల్‌గా ఫేమస్‌ అయిన హైపర్‌ ఆది ఏకంగా అధికార పార్టీలను విమర్శించే స్థాయికి ఎదిగాడు. ఓ స్కిట్‌లో ఉప్పుకప్పూరంబు బీకాంలో ఫిజిక్స్‌ ఉంటూ అండూ తెదెపా నాయకులపై పంచ్‌ వేశాడు. అనంతరం తమిళరాజకీయాల్లో కీలకమైన శశికళ సీఎం అవాలనుకుని చివరకు జైల్లో సాంబార్‌తో మూడు పూటల తింటుంది అంటూ బాంబ్‌ పేల్చాడు. దాంతో ఆది పంచ్‌లు రాజకీయ వర్గాలదాకా చేరాయి.

ఏపీలో తెదేపాపై పంచ్‌లు వేసినా ఆదికి వైకాపా నుండి ఆహ్వానం లభించింది. మరోవైపు ‘జబర్దస్త్‌’ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించే రోజా మద్దతు కూడా లభించడంతో ఆదికి వైకాపాలోకి ఎంట్రీ దక్కింది. ఆది వేసిన పంచ్‌లు తెదేపాపై పేలడంతో ఆదికి రాజకీయ భవిష్యత్‌ లభించింది. వచ్చే ఎన్నికల్లో ఆదికి వైకాపాలో సీటు కూడా లభించనుందని తెలుస్తోంది. రోజా అందుకు తగిన సన్నాహాలు కూడా చేస్తుంది. అసలే ఆదికి ప్రేక్షకుల్లో పిచ్చా ఫాలోయింగ్‌ ఉంది. దాంతో వైకాపాకుఅది కూడా కొంత ప్లస్‌ అవుతుంది అని వైకాపా వర్గీయులు భావిస్తున్నారట.