వైకాపాలోకి మంచులక్ష్మి... మోహన్‌బాబు రాయబారం

కలెక్షన్‌ సింగ్‌ తాజాగా వైకాపా అద్యక్షుడు జగన్‌ కలిశాడు. తన కూతురు మంచు లక్ష్మికి ఎమ్మెల్యేగా టికెట్‌ అడగడానికి మోహన్‌బాబు జగన్‌ను కలిసినట్టు సమాచారం. మోహన్‌బాబు పెద్ద కోడలు జగన్‌కు దగ్గరి బంధువు, ఆ సాన్నిహిత్యంతో మోహన్‌బాబు లక్ష్మి కోసం టికెట్‌ అడగడానికి వెళ్లాడు. అంతేకాకుండా తన కూతురికి చంద్రగిరి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో టికెట్‌ ఇవ్వమని అడిగాడట. కానీ జగన్‌ మాత్రం మోహన్‌బాబుకు ఏం సమాధానం చెప్పలేదట. కొంత సమయం తీసుకుని ఆలోచించి చెబుతాను అని జగన్‌ తప్పించుకున్నాడట.

మంచులక్ష్మి అంటే ప్రజలకు పెద్దగా ఆసక్తి ఉండదు అని అందరికి తెల్సిందే. అంతేకాదు ఆమె ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా మాట్లాడదు. అలాంటిది ఏకంగా మొదటిసారే టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుంది అని జగన్‌ ఆలోచనలో పడ్డాడట. అంతేకాకుండా మోహన్‌బాబు అడిగిన ఆ రెండు నియోజక వర్గాల్లో కూడా జగన్‌కు అత్యంత సన్నిహితులైన వారే ఉన్నారట. పార్టీకి మొదటి నుండి అండగా ఉంటూ నిరంతర కష్టపడిన సీనియర్‌లను వదిలేసి మంచు వారమ్మాయికి టికెట్‌ ఇస్తే ఫలితం ఎలా ఉంటుంది అని జగన్‌ ఆలోచించి లక్ష్మి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడట.