విల‌న్ గా శ్రీ‌కాంత్..

టాలీవుడ్ సీనియర్ న‌టుడు శ్రీకాంత్ విలన్ అవతారంలోకి మారిపోతున్నాడు. నాగచైతన్య హీరోగా ఎం. కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. ఇందులో శ్రీకాంత్ విలన్ గా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమాలో చేస్తున్న శ్రీకాంత్.. ఆ రోల్ కోసం మేకోవర్ చేశాడు. సాల్ట్ అండ్ పెప్పర్ గెడ్డం లుక్ ను తన పుట్టిన రోజున ఓ ఫోటో షూట్ ద్వారా అందరికీ చూపించాడు కూడా. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్ లో కొత్త విలన్స్ కోసం ఎప్పుడూ వెతుకులాట ఉంటుంది కాబట్టి.. వెంటనే విలన్ ఆఫర్ కూడా వచ్చేసింది. చైతుకు మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు శ్రీకాంత్. నిజానికి శ్రీకాంత్ కు విలన్ రోల్స్ కొత్తేమీ కాదు. కెరీర్ స్టార్టింగ్ లో అన్నీ నెగిటివ్ రోల్స్ లోనే కనిపించాడు. తాజ్ మహల్ తో హీరోగా కుదురుకుని.. పెళ్లి సందడితో బోలెడంత ఇమేజ్ సంపాదించేసుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు విలన్ రోల్ లో నటించబోతున్నాడు శ్రీకాంత్.