విజయగర్వంతో బాబు... నా మాటలకు తిరుగులేదు

తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలు తేదేపాకే అగ్రస్థానం తీసుకువచ్చాయి. దాంతో అధికార పార్టీ అయిన తెదేపా నాయకుల మొహంలో ఆనందం విరబూసింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎంతో సహా టీడీపీ నేతలంతా కూడా అమితానందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సమావేశంలో మొత్తం నవ్వుతూనే మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ ఫలితాలే నిదర్శణం అని విజయగర్వాన్ని చూపించారు. ప్రజల కోసం మరింత కష్టపడి తెలుగు జాతి సత్తా చూపిస్తాం, నా మాటలకు ఇక తిరుగులేదు అంటూ విజయ గర్వంతో చాలా ధీమా వ్యక్తం చేశాడు.

తాత్కాలిక అసెంబ్లీనే ఇంత బావుంటే ఇక శాశ్వత అసెంబ్లీ ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అని చంద్రబాబు అంటుండగా వైకాపా నేతలు ఏదో కామెంట్‌ చేయబోయారు. దాంతో సభలో హుందాగా ఉండాలి లేదంటే ఇవే ఫలితాలు పునారావృతం అవుతాయి అంటూ బాబు ప్రతిపక్షంపై మండి పడ్డారు. మొత్తానికి ఫలితాలు తెదేపాకు సానుకూలంగా రావడంతో చంద్రబాబు మొహంలో ఆనందం ఇటే ఉట్టిపడుతుంది. సభ మొత్తం కూడా నవ్వుతూ ప్రసంగాన్ని కొనసాగించాడు.