రాష్ట్ర చిహ్నాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును ప్రభుత్వం గుర్తించింది. దీనితోపాటు మరికొన్ని రాష్ట్ర రాష్ట్ర చిహ్నాలను బుధవారం ఖరారు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక పక్షిగా ఉన్న పాలపిట్టను తెలంగాణ సైతం తమ రాష్ట్ర పక్షిగా గుర్తించింది. దీంతో ఏపీ రాష్ట్ర పక్షిగా ప్రస్తుతం రామచిలుకను ప్రభుత్వం ఎంపిక చేసింది. గతంలో రాష్ట్ర పుష్పంగా ఉన్న కలువ స్థానంలో మల్లెపువ్వు చేర్చారు. ఎప్పటిలాగే రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, జంతువుగా కృష్ణ జింక‌ కొనసాగుతాయి.ఈమేరకు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర పక్షిగా రామచిలుకను, రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వు ను, రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును. రాష్ట్ర జంతువుగా కృష్ణజింకను ఖరారు చేశారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ‘ప్రగతి చక్రం’అధికారిక చిహ్నంగా ఉండేది. అయితే దీనిలో కూడా మార్పులు చేస్తూ ‘సన్ రైజ్ స్టేట్’‌ను నవ్యాంధ్ర అధికారిక చిహ్నంగా రూపొందించింది.