రాధికా శరత్‌కుమార్ అమ్మమ్మ అయ్యింది!!!

ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అమ్మమ్మ అయ్యింది. బుధవారం రాత్రి ఆమె కుమార్తె రయన్నె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాధికా తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘సో సో హ్యాపీ.. గాడ్ బ్లెస్..’’ అంటూ ‘ఇట్స్ ఏ బాయ్’ అనే చిత్రాన్ని పోస్ట్ చేశారు. రయన్నె 2016లో క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను పెళ్లాడింది.

రాధిక రెండో భర్త రిచర్డ్ హార్డిల కుమార్తె రయన్నె. 1992లో ఆయనకు విడాకులిచ్చిన రాధిక.. 2001లో నటుడు శరత్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రాధిక సినిమాల్లో నటిస్తూనే డైలీ సీరియళ్ల నిర్మాతగా బిజీగా ఉన్నారు.