యోగి ఆధిత్యనాథ్‌ మరో సంచలన నిర్ణయం

అక్రమ కబేళాలపై నిషేధం, రోమియోల ఆటకట్టించేందుకు టీంల ఏర్పాటు, తదిరత నిర్ణయాలతో ఇప్పటికే సంచలనంగా మారిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌.. మరో సంచనల నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర స్థలాలుగా భావించే అన్ని ప్రదేశాల్లోనూ, మద్య నిషేదం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. నూతన ఎక్సైజ్‌ విధానాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొద్ది రోజులకే సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. యూపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం... సుప్రీం కోర్టు తీర్పు అనంతరం 8,544 మద్యం దాకాణాలను వేరే స్థలాలకు తరలించారు. సీఎం మద్యం నిషేదం విధించిన ప్రాంతాల్లో హిందు పుణ్యక్షేత్రాలతోపాటు, ముస్లిం సహా పలు మతాలకు చెందిన పవిత్ర స్థలాలు కూడా ఉండడం గమనార్హం. బృందావన్‌, ఆయోధ్య, చిత్రకూటం మిశ్రక్‌ నైమిశారణ్యం, పిరాన్‌ కలియార్‌, దేవషరిఫ్‌, దేవబంద్‌ సహా తదితర పవిత్ర క్షేత్రాల్లో ఒకపై మద్య నిషేదం అమలు కానుంది. కాగా, తాజా నిర్ణయంతో పలు మతాలకు చెందిన పెద్దలు యోగిని ప్రశంసింస్తున్నారు.