"మ‌ర‌క‌త‌మ‌ణి"సినిమా రివ్యూ

చిత్రం: మరకతమణి
రేటింగ్: 1.0/5.0
సంగీతం: దిబు నైన‌న్ థామ‌స్‌
నిర్మాత:శ్రీ చ‌క్ర ఇన్నేవేష‌న్స్, రుషి మీడియా, యాక్స్ స్ ఫిలిం ఫ్యాక్ట‌రీ
ద‌ర్శక‌త్వంః ఎ ఆర్ కె శ‌రవ‌ణ్

స్టారింగ్:ఆది పినిశెట్టి, నిక్కి గిలానీ, కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం త‌దిత‌రులు

ఈ మధ్య కాలంలో హ‌ర్ర‌ర్ నేప‌ధ్యంతో వ‌స్తున్న సినిమాల సంఖ్య పెరిగిపోయింది. కంటెట్ లేకున్నా ఈ సినిమాలకు డ‌బ్బులు మాత్రం వ‌స్తాయ‌ని గ్యారంటీ ఉండ‌టంతో వీటిని తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. నేడు విడుద‌లైన మూవీ మ‌ర‌క‌త‌మ‌ణి కూడా అ కోవ‌లోకే వ‌స్తుంది.ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం.

కథలోకివెళితే...
ఓ చిన్న స్మ‌గ్ల‌ర్ ర‌ఘునంద‌న్ (ఆది పినిశెట్టి). అత‌డో అమ్మాయిని నిక్కిగిల్రానీ ప్రేమిస్తాడు.అయితే అది స‌ఫ‌లం కాదు.దీంతో బాగా డ‌బ్బు సంపాదించాల‌ని ప్లాన్ వేస్తాడు.ఈ స‌మ‌యంలోనే ఒక ముఠా విలువైన మ‌ర‌క‌త‌మ‌ణిని సంపాదించాల‌ని ప్లాన్ వేస్తుంది. ఆ మ‌ణిని తాను తీసుకువ‌స్తాన‌ని, అందుకు ప‌ది కోట్ల రూపాయిలు ఇవ్వాల‌ని బేరం పెడ‌తాడు ఆది. డీల్ ఓకే అవుతుంది.మ‌ణి అన్వేష‌ణ కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఆ మ‌ణిని తాకిని 132 మంది ఒక వాహ‌న ఢీకోన‌డంతో మ‌ర‌ణిస్తార‌ని తెలుసుకుంటాడు.దీంతో ఆది ఒక తాంత్రికుడ్ని ఆశ్ర‌యిస్తాడు.అత‌డి స‌ల‌హా ప్రకారం మూడు ఆత్మ‌ల స‌హాయం తీసుకుంటాడు.విచిత్ర‌మేమిటంటే అత‌డు ఎంత‌గానో ప్రేమించిన నిక్కి అత‌డి క‌ళ్ల ముందే ఆత్మ‌హ‌త్య చేసుకుని, మ‌ర‌క‌త‌మ‌ణి ఆన్వేష‌ణ‌లో స‌హ‌య ప‌డ‌టం.ఇంత‌కీ మ‌ర‌క‌త‌మ‌ణి ఆది సాధించాడా?అస‌లు మూడు ఆత్మ‌లు ఎవరివి? వారికి ఆ మణికి సంబంధం ఏమిటి? నిక్కి ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంది? తెలీయాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
హీరో ఆది పినిశెట్టి, నిక్కిగ్రిలానీ, కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలోనే న‌టించారు.

సాంకేతికపరంగా...
మ‌ర‌క‌త‌మ‌ణి అన్వేష‌ణ పేరుతో ఈ మూవీలో సస్పెన్స్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అయితే మూవీలో నేప‌థ్యంలో ఒక్క పాట మిన‌హా లేక‌పోవ‌డంతో ఎక్క‌డ విసుగు అనిపించ‌కుండా సాగిపోతుంది..దిబు నైన‌న్ థామ‌స్ సంగీతం, పి.వి.శంక‌ర్ కెమెరా ప‌నిత‌నం ఓకే.

విశ్లేషణ...
కథ లేకున్నా తను చెప్పాలనుకున్నదానిని సూటిగానే చెప్పేసాడు దర్శకుడు. మొత్తనికి ఈ సినిమాను కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు.

నచ్చినవి...
హారర్ తో పాటు కాసేపు ట్రేజర్ హంట్

నచ్చనివి...
రోటీన్ హారర్ సినిమా

చివరగా...
కాసేపు కాలక్షేపం