మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

లోకంలో అన్నింటికన్నా,
అమూల్యమైనది....,అతి మధురమైనది....,అనంతమైనది..., అమ్మ అనురాగం......

ఒకసారి దేవతలందరూ కలిసి ఒక బాబును భూమి మీదకు పంపుదామని అనుకుంటూ ఉంటారు.దానితో ఆ బాబు భగవంతుడ్ని అడుగుతాడు...

ఓ భగవంతుడా!

నన్ను భూమి మీదకు పంపుదామని అనుకుంటున్నారట కదా! అక్కడ నేను ఈ చిన్ని రూపంతో ఎవరు లేకుండా ఎలా మనగలను?
దానికి ఆ భగవంతుడు నవ్వుతూ నీ కోసం ఒక దేవత భూమి మీద నీ రాక కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంది అమే నీకు అన్నీ చూసుకుంటుందన్నాడు.

మరలా ఆ బాబు
ఇక్కడే నాకు చాలా బాగుంది, ఏ పని ఉండదు, సమయమంతా ఆటపాటలతోనే గడిచిపోతుంది కదా అని అంటే
దానికి ఆయన ఆ దేవత నీ కోసం పాటలు పాడుతుంది, ఆడుతుంది, నిన్ను నవ్విస్తుంది, ఆవిడ సమక్షంలో ఇక్కడ కన్నా ఎక్కువ సంతోషంగా ఉంటావు అని అన్నాడు.

మరలా ఆ బాబు
నేను ఇతరులతో ఎలా మాట్లాడగలను వారి భాష నాకు రాదు కదా అంటే
ఏమీ అవసరం లేదు ఆమెకి తెలుసు నీతో ఎలా మాట్లాడాలో, నీవు ఎంతసేపు ఇబ్బంది పెట్టినా ఏమీ అనుకోకుండా నీకు ఆ భాష వచ్చేదాక ఓర్పుతో నేర్పుతుంది అన్నాడు.

మరలా ఆ బాబు
మరి భూమి మీద నేను ఉన్నప్పుడు నిన్ను ఎలా ప్రార్ధించాలి, నీతో ఇలా ఎలా మాట్లాడాలి అని అంటే
రెండు చేతులు జోడించి నన్ను ప్రార్ధించడం, నాతో మాట్లాడటం సైతం ఆమే నేర్పుతుంది అని అంటే

మరలా ఆ బాబు
సరే అంతా బాగానే ఉంది మరి నన్ను రక్షించడం అంటే తన ప్రాణాలు పోయిన తరవాతే ఎవరైనా నీ నీడనైనా తాకేది అన్నాడు.

మరలా ఆ బాబు
అయినా సరే నాకు మాత్రం చాలా బాధగా ఉంది నిన్ను వదిలి వెళ్ళాలంటే ఇంక నిన్ను మాత్రం ఎప్పుడు చూడలేనుగా అంటే
నీకు ఆ దేవత నా గురించి పదే పదే , నా సన్నిధానానికి ఎలా రావాలో నేర్పుతుంది. సదా నేను నీ ప్రక్కనే ఉండేటట్లు చేస్తుంది అని అన్నాడు.

సరే అయితే నేను నిన్ను విడిచి వెళతాను ఇంతకీ నిన్ను మరిపించే ఆ దేవతని నేను ఏమని పిలవాలి, నాకు ఆ దేవత పేరు చెప్పు అంటే దానికి ఆ భగవంతుడు
ఆమేని
అమ్మ అని పిలువు అని చెప్పాడు.

ఎందరో మాతృదేవతలు అందరికి మా హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.