మాటే మంత్రము....

నీవు పలికే ప్రతి మాట మంత్రమై నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని అనడంలో ఎంతో యధార్ధము ఉంది. ఈ మాట స్వయంగా స్వామీ వివేకానందులవారే చెప్పరు.

" నీ ఆలోచనలే నీ మాట కావాలి..
నీ మాటలే చేతలుగా మారాలి..
నీ చేతలే అలవాట్లవాలి..
నీ అలవాట్లే నీ శీలంగా రూపుదిద్దుకోవాలి..
అదే నీ భవిష్యత్తు కావాలి.."

పైవన్నీ సరియైన మార్గంలో ఉన్నప్పుడే విజయం నీదవుతుంది.వీటిలో ముఖ్యమైనది మాట.నీ ఆలోచనలు నీ నోటి గడప దాటేముందు "విచక్షణ" ఉండాలి.అలా విచక్షణతో మాట్లాడేవాళ్ళే విజయాన్ని చేజిక్కించుకుంటారు.

అని స్వామి వివేకానంద భోదించారు.

మాట బంగారమైనప్పుడు ఈ విశ్వాన్నే జయించవచ్చు అని మన మాటలు ఎలా ఉండాలో ఈ క్రింది విధంగా ఆ స్వామి సెలవిచ్చారు.

* వినయం, విధేయతతో కూడిన మాటతో విశ్వాన్నే జయించవచ్చు..
* మూర్ఖులు వాధిస్తారు. మేధావులు మాట్లాడతారు. మహాపురుషులు మౌనంగా ఉంటారు.
* అతిగా మాట్లాడితే, ఎదుటి వ్యక్తికి బాగా అర్ధమవుతుందనలేము.మితంగా మాట్లాడితే, అమితమైన సమాచారం అందుతుంది.
* ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. ఎంచుకుని మాట్లాడితే, వివేకానికి, మూర్ఖతకు తేడా తెలుస్తుంది.
* వ్యంగ్యంగా మాట్లాడే వ్యక్తులు అనుబంధాలు తెగిపోతున్నాయని గుర్తించరు.
* ఎదుటి వ్యక్తి పై కోపాన్ని వ్యక్తపరచడంలో మీ వ్యక్తిత్వం బహిర్గతమవుతుంది.అరుపు, మందలింపు, కోపం, శాంతం..లాంటివే..
* చిన్నమాట మనిషిలోని మానవత్వాన్ని, పశుత్వాన్ని బయట పెట్టేస్తుంది
* మాటల్లోని సద్వర్తనను, చేతల్లోని క్రమశిక్షణనూ సమన్వయ పరచడమే విజయం..