"మహానుభావుడు" సినిమా రివ్యూ

చిత్రం: మహానుభావుడు
రేటింగ్:3.0/5.0
సంగీతం : తమన్
దర్శకత్వం : మారుతి
బ్యానర్: క్రియేషన్స్
నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి

స్టారింగ్ : శర్వానంద్, మెహరీన్ కౌర్, వెన్నెల కిషోర్, నాజర్, వేణు తదితరులు…

ప్రేమ కథ చిత్రం , భలే భలే మగాడివో , బాబు బంగారం లాంటి వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మారుతీ , శతమానం భవతి చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శర్వానంద్, విభిన్న కథలను ఎంచుకుని తనదైన శైలిలో నటిస్తూ మన మధ్యన ఈ వ్యక్తి ఉన్నాడేమో అనే విధంగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూరగొన్నారు శర్వానంద్. మరి ఈ రోజున వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
భలే భలే మగాడివో తరహాలోనే సినిమా ఉంది. ఆ మూవీలో నాని మతిమరుపుతో ఆకట్టుకుంటే , ఇందులో మాత్రం శర్వానంద్ అతి శుభ్రత తో ఆకట్టుకున్నాడు. ఇందులో ఆనంద్(శర్వానంద్) అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ తో భాదపడుతుంటాడు.అంటే కడిగిందే కడగడం, తుడిచిందే తుడవడం లాంటి, వేసిన తాళాన్ని పదిసార్లు చూడడం లాంటిది. ఏం చేసిన దానిలో శుభ్రత పాటిస్తాడు ఎంతలా అంటే చివరకు హీరోయిన్ కు ముద్దు ఇవ్వాలన్న కూడా శుభ్రత ఉందా లేదా అనేది చుస్తాడంటే ఇతడి అతి శుభ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోండి. ఇలాంటి ఆనంద్ కి నీట్ నెస్ కి ప్రాధాన్యం ఇచ్చే అమ్మాయితో ( మెహ్రీన్ ) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అన్ని సినిమాల్లో లాగానే ఆ పిల్ల తండ్రికి అబ్బాయి నచ్చడు…కాదు కాదు అతని అతి శుభ్రం నచ్చదు. దీంతో ప్రేమించిన అమ్మాయి కోసం శుభ్రతకి ప్రాణం ఇచ్చే ఆనంద్ ఓ పల్లెటూరు వెళ్లాల్సివస్తుంది. అక్కడ తన అతిశుభ్రత తెచ్చే కష్టాలు ఏంటి? అందులో నుండి ఎలా బయటపడతాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
సినిమా అంతా OCD తో భాదపడే ఆనంద్ మాత్రమే కనిపిస్తాడు కానీ ఎక్కడా శర్వానంద్ మాత్రం కనిపించడు. ఆనంద్ ఒక పాత్ర అని అది శర్వానంద్ చేస్తున్నాడు అనే సంగతి మనకు సినిమా అంతా అయ్యేవరకు గుర్తుకురానంతలా పాత్రలో ఒదిగిపోయి నటించాడు. మెహ్రీన్ తన పరిధిలో బాగానే చేసింది.మిగిలినా వారు వారి వారి పరిధిలో బాగానే చేసి మెప్పించారు.

సాంకేతికపరంగా...
OCD తో బాధ పడే హీరో, అతని ప్రవర్తన, దాంతో ఎదురయ్యే పరిస్థితులు ఈ సినిమాకి ఆయువుపట్టు. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో మతిమరుపు చుట్టూ కథ అల్లుకున్న దర్శకుడు మారుతి ఈ సినిమాలో OCD ప్రాబ్లెమ్ ని టచ్ చేసాడు. సెంట్రల్ పాయింట్ తో పాటు దాని చుట్టూ అల్లుకున్న సీన్స్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు మారుతి. రొటీన్ అనుకునే లవ్ సీన్స్ కూడా స్పెషల్ గా అనిపించేలా చూసుకున్నాడు. కధలో పాతదనం ఉన్నప్పటికీ హీరో కి వున్న సమస్య కొత్తది కావడం వల్ల ఎక్కడా ఆ అభిప్రాయం కలగదు. సంగీతం బాగుంది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

విశ్లేషణ...
శర్వానంద్ ఈ సినిమాలో ఒకటిరెండు చోట్ల మాత్రమే కనిపిస్తాడు. సినిమా అంతా (ఒచ్ద్) తో బాధపడే ఆనంద్ మాత్రమే కనిపిస్తాడు. సినిమా అయిపోయాక ఇంటిదాకా గుర్తొచ్చి నవ్విస్తాడు. ఓ పాత కథని కొత్త పాయింట్ చుట్టూ అల్లుకుని కామెడీ తో ప్రేక్షకుల్ని ఆలరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

నచ్చినవి...
శర్వానంద్ పాత్ర
కామెడీ
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే

నచ్చనివి...
ఎడిటింగ్

చివరగా...
OCD ఉన్న మరో భలే భలే మగాడు ఈ మహానుభావుడు