మంత్రుల ఆస్తులపై నయా సీఎం తొలి ఆదేశం

ఇటీవలె జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో భాజాపా భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేశాడు. అనంతరం మంత్రులతో భేటి అయిన యోగీ తాజాగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనను రూపుమాపడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. రాష్ట్రంలో 15ఏళ్ల నుండి అవినీతి పెరిగిపోయి అభివృద్ది కుంటుపడిరది. శాంతిభద్రతలు కరువయ్యాయి అని యోగీ యూపీ పరిస్థితులను వివరించారు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం చేయడానికి సమాయత్తం అవుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం యోగీ మంత్రులపై మొదటి ఆదేశాన్ని జారీ చేశారు. మంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడిరచాలని యోగీ మంత్రులను ఆదేశించాడు. 15రోజుల్లోగా మంత్రులందరు తమ స్థిర, చర, ఆదాయాలను వివరాలతో సహా ప్రకటించాలని, అవినీతిపై ఉక్కుపాదం మోపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని యోగీ తెలిపారు. మొత్తానికి యూపీలో కొత్త తరహా అభివృద్దిని తీసుకురావడానికి కార్యచరణ సిద్దం చేస్తున్నట్టు యోగీ ఆదిత్యనాథ్‌ ఈ సందర్భంగా వెల్లడిరచారు.