భీష్మ‌గా బిగ్ బి, భీముడిగా మోహన్ లాల్

ప్రముఖ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహాభారత్ ప్రాజెక్టును వీఏ శ్రీకుమార్ మీనన్‌ దర్శకత్వంలో నిర్మించనున్నాడు. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది . ఇంగ్లిష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో సినిమాను చిత్రీకరించనున్నారు. దీంతోపాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ చేయనున్నారు. భారతీయులతో పాటు విదేశీయులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2018 సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. 2020లో తొలి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానున్నది. 90 రోజుల గ్యాప్ తో సెకండ్ పార్ట్ కూడా విడుదల కానుందని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ భీముడుగా నటించనున్నాడు ఇక బిగ్ బీ అమితాబ్ భీష్ముడిగా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది.