"భాగమతి" సినిమా రివ్యూ

చిత్రం: భాగమతి
రేటింగ్: 3.0/5.0
బ్యానర్:యువి క్రియేషన్స్
సంగీతం : థమన్
దర్శకత్వం : జి. అశోక్
నిర్మాత: వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌

స్టారింగ్ : అనుష్క, ఉన్ని ముకుందన్ , జయరామ్, ఆషాశరత్ తదితరులు...

అరుంధతి , రుద్రమదేవి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో టాప్ హీరోలతో పోటీగా మార్కెట్ సంపాదించిన అనుష్క, బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు మరోసారి యూనివ‌ర్స‌ల్ స‌బ్జ‌ెక్ట్‌‌ ఎంచుకుని ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు శుక్రవారం నాడు థియేటర్స్‌కి వచ్చేస్తుంది. ‘ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. ‘భాగమతి’ అడ్డా.. లెక్క తేలాలి, ఒక్కడ్ని పోనివ్వనూ’ అంటూ ‘భగ.. భగ.. భగ.. భాగమతి’ ట్రైలర్‌తో భయపెట్టేసిన అనుష్క ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్ అగ్రనాయకిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక వైపు అందాల సౌందర్య వతిగా దర్శనం ఇచ్చిన అనుష్క, ‘భాగమతి’గా మారి ట్రైలర్‌లో దడ పెట్టించింది. మరి భారీ అంచనాలతో విడుదలైన ‘భాగమతి’ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
నీటిపారుదల శాఖ మంత్రిగా భాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈశ్వర్ ప్రసాద్(జయరామ్)కు ఐఏఎస్ అధికారిణి అయిన చంచల(అనుష్క)సెక్రటరీగా పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా తను ఓ మర్డర్ కేసులో చంచల జైలులో ఉండాల్సివస్తుంది. ప్రజల్లో ఈశ్వర్ ప్రసాద్‌కున్న మంచి పేరు కారణంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉండడంతో ఆయనపై అభియోగాలు మోపి మంత్రి పదవి నుంచి దించేయాలని కొందరు ప్రయత్నిస్తుంటారు.నిజాయితీగల మంత్రిపై నిందలు వేయడం మాములు విషయం కాదు. దీనికోసం వైష్ణవి(ఆశా శరత్) అనే సీబీఐ ఆఫీసర్ సహాయం తీసుకుంటారు. అందుకని వైష్ణవి, చంచలను ఈ విషయంగా ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటుంది. ఒక కేసులో జైలులో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఇన్వెస్టిగేట్ చేయండం కుదరదని చంచలను దెయ్యాలకోటగా చెప్పుకునే ‘భాగమతి’ బంగ్లాకు షిఫ్ట్ చేస్తారు. దెయ్యాలను నమ్మని చెంచల ఉన్నట్టుండి ఆమెను ఎవరో తరుముతున్నట్లు, కొడుతున్నట్లు చంచల పెద్ద పెద్ద అరుపులతో అందరిలో భయాన్ని క్రియేట్ చేస్తుంది. తను చంచల కాదని ‘భాగమతి’ అని.. తనకోటలోకి వచ్చిన ఎవరిని వదిలిపెట్టనని బెదిరిస్తుంది. ఇంతకీ ఈ ‘భాగమతి’ ఎవరు..? చంచల తనను తాను ‘భాగమతి’ అని ఎందుకు చెప్పుకుంటుంది..? నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
అనుష్క తన అధ్బుతమైన నటన, హావభావాలతో కట్టి పడేసింది. అనుష్క చంచలగా, భాగమతిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలను తెరపై బాగా పండించింది. భాగమతిగా అనుష్క హావభావాలు, వేషధారణ, నడక అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. పాడుబడ్డ కోటలోకి అనుష్క తొలిసారి వెళ్లే సన్నివేశం, ఇంటర్వల్ ఎపిసోడ్‌లో తనలో భాగమతి ఆవహించింది అన్నట్లు నటించే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి. చీరకట్టులో కొన్నిచోట్ల ఎంతో అందంగా కనిపించింది. జయరామ్ పాత్రలో కూడా రెండు షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు తన నటనతో పూర్తి న్యాయం చేశాడు. ఉన్ని ముకుందన్ పాత్రను ఇంకా ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దాల్సింది. ఆశా శరత్‌తో పాటు మిగతా వారందరూ ఫర్వాలేదనిపిస్తారు.

సాంకేతికపరంగా...
నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఖర్చు పరంగా నిర్మాతలు వెనుకాడలేదు. దర్శకుడు అశోక్ టేకింగ్ ఆకట్టుకుంటుంది. కోట సెటప్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

విశ్లేషణ...
ప్రజలను మోసం చేస్తూ వారి శవాల మీద సొమ్ము చేసుకునే ఒక రాజకీయ నాయకుడు, అతడిని అంతం చేయాలనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ పాయింట్‌కు దెయ్యాలనే కాన్సెప్ట్‌ను జతచేసి దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే ఈ ‘భాగమతి’. సెకండ్ హాఫ్ బలంగా ఉండి ఉంటే ఇంకా మంచి చిత్రం అయ్యి ఉండేది. దర్శకుడు ద్వితీయార్ధాన్ని మరింత బాగా మలిచి ఉన్నట్లయితే ‘భాగమతి’ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయేది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఆసక్తి వల్ల ఓపెనింగ్స్‌కి ఎలాంటి ఢోకా ఉండదు.

నచ్చినవి...
అనుష్క
కథ
దర్శకుది తపన

నచ్చనివి...
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్

చివరగా...
అనుష్క కూడా భయపెట్టగలదు ఎలానా?? --- "భాగమతి" గా