'బాలకృష్ణుడు' సినిమా రివ్యూ

చిత్రం: బాలకృష్ణుడు
రేటింగ్: 2.0/5.0
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం :పవన్ మల్లెల
నిర్మాత: మహేంద్ర బాబు

స్టారింగ్ : నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, వెన్నెల కిషోర్, పృధ్వి తదితరులు...

‘బాణం’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తరవాత సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండే వాడు, రాజా చేయి వేస్తే వంటి మూవీలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నారా రోహిత్. కథల ఎంపికలో రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యభరిత కథలను ఎన్నుకునే నారా రోహిత్ తాజా చిత్రం 'బాలకృష్ణుడు'. నారా రోహిత్, రెజీనా జంటగా, పవన్ మల్లెల తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'బాలకృష్ణుడు' ఈ రోజు థియేటర్స్‌లో విడుదలై సందడి చేస్తుంది. 'బాలకృష్ణుడు' అనే క్యాచీ టైటిల్‌‌తో పాటు టీజర్, ట్రైలర్ కూడా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఊన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
కర్నూలు జిల్లాలో రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల మంచి కోసం పోరాడుతుంటాడు. అతడి చెల్లెలు భానుమతి(రమ్యకృష్ణ) అతడి ఆలోచనలకు సహాయపడుతుంది. ప్రజల్లో రవీందర్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి రగిలిపోయిన బసిరెడ్డి(మహదేవన్) రవీందర్ చేతుల్లో ఓడిపోయి అవమానంతో సూసైడ్ చేసుకుంటాడు. తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి(అజయ్) రవీందర్‌ను చంపేస్తాడు. ఈ కేసులో ప్రతాప్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అన్నకు ఇచ్చిన మాట కోసం ఆయన ఆశయాల కోసం భానుమతి ప్రజలకు అండగా నిలుస్తుంది. రవీదర్ కూతురైన తన మేనకోడలు ఆద్య( రెజీనా)ను ఈ గొడవలను దూరంగా ఉంచి చదివిస్తుంటుంది. ప్రతాప్ రెడ్డి జైలు నుండి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, ఆద్య కోసం బాలు(నారా రోహిత్) అనే బాడీగార్డ్‌ను నియమిస్తుంది. మరి బాలు, ప్రతాప్ రెడ్డి నుండి ఆద్యను కాపడగలిగాడా? బాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? బాలు, ఆద్య ఒక్కటయ్యారా? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
ఇంతవరకు ఎప్పుడు నారా రోహిత్‌ను ఈ తరహా పాత్రలో చూసి ఉండరు. తన బాడీ లాంగ్వేజ్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో కనబరిచాడు. రెజీనా తన నటనతో పాటు అందంతో కూడా అలరించింది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది రమ్యకృష్ణ నటన. తన హావభావాలతో భానుమతి పాత్రను రక్తి కట్టించింది. అజయ్ విలన్ రోల్‌లో ఎప్పటిలానే కనిపించాడు. పృధ్వీ కామెడీ సినిమాలో బాగా పర్వాలేదనిపించింది.

సాంకేతికపరంగా...
మణిశర్మ సంగీతం సినిమాకు అసెట్. నేపధ్య సంగీతం మరింత ఆకట్టుకుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. మరోసారి రొటీన్ ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి 'బాలకృష్ణుడు' బాగా విసిగించాడు. కథలో ఎక్కడా కూడా కొత్తదనం అనేది కనిపించదు.

విశ్లేషణ...
పక్కా కమర్షియల్ ఫార్ములాతో దర్శకుడు పవన్ మల్లెల ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరినే ఈ సినిమాలో కూడా ఫైట్లు, చేజింగ్ లు, పంచ్ కోసం తాపత్రయ పడే డైలాగులు అన్నీ ఉన్నాయి. కానీ కథలో సత్తా మాత్రం లేదు. కథలో ఎక్కడా కూడా కొత్తదనం అనేది కనిపించదు. హీరోయిన్ కుటుంబం ఆపదలో ఉండడం, హీరో సీన్ లోకి ఎంటర్ అవ్వడం, విలన్‌ను చంపేయడం ఇదే తంతు. పతాక సన్నివేశాలు మరింత విసిగిస్తాయి.
ఫ్యాక్షన్ సినిమాలను చూడటం ఇష్టం ఉన్నవాళ్ళు ఒకసారి చూడవచ్చు.

నచ్చినవి...
రమ్యకృష్ణ నటన
నారా రోహిత్ నటన
రెజీనా

నచ్చనివి...
రోటీన్ కథ
ఎడిటింగ్

చివరగా...
రోటీన్ సినిమాలలో ఒకటి