బాబోయ్‌... ఐటెం కోసమే అంత ముట్టజెప్పారా...!!

ముద్దుగుమ్మ కేథరిన్‌ త్రెసాకు సినిమాలు ఏవి కూడా చేతిలో లేవు. దాంతో హీరోయిన్‌గానే కాకుండా ఐటెంగా కూడా ఆడిపాడడానికి ఈ అమ్మడు రెడీ అయ్యింది. మొదట్లో కేథరిన్‌కు ఏకంగా చిరు చిత్రంలో ఐటెంగా చిందులేసే అవకాశం వచ్చింది. కానీ కాస్ట్యూమ్స్‌ విషయంలో ఈ అమ్మడు మంచి ఆఫర్‌ను వదులుకుంది. అనంతరం కేథరిన్‌ చాలా బాదపడిరది. ఆ ప్రాజెక్ట్‌ తర్వాత కేథరిన్‌కు ఇక అవకాశాలే రాలేదు. తాజాగా ఈ అమ్మడికి మరో ఐటెం ఆఫర్‌ వచ్చింది. బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఐటెంగా ఆడిపాడడానికి కేథరిన్‌ను బుక్‌ చేసుకున్నట్టు సమాచారం.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు. హీరోకు పెద్దగా పాపులారిటీ లేకున్నా కూడా హీరోయిన్లను బాగా ఉపయోగించుకుంటాడు ఆ హీరో. అందుకే తన చిత్రాలలో స్టార్‌ హీరోయిన్లను మాత్రమే ఎంపిక చేసుకుంటాడు. ఈ చిత్రంలో సాయిశ్రీనివాస్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యా జైస్వాల్‌లు రొమాన్స్‌ చేస్తున్నారు. ఇక ఐటెంగా కేథరిన్‌ను తీసుకున్నారు. కేథరిన్‌ హీరోయిన్‌గా ఫుల్‌ మూవీలో చేసినా కూడా 30లక్షలు రావడం లేదు అలాంటిది కేవలం ఐటెం పాటకే ఈ అమ్మడికి ఏకంగా 60లక్షలను ముట్టజెప్పారట. మొత్తానికి ఈ చిత్రంలో హీరోయిన్ల కోసం యూనిట్‌ తెగ ఖర్చుపెడుతోంది. వారితోనే పాపులారిటీ రావాలని ఎక్కువ మొత్తంలో ఇచ్చి పని చేయించుకుంటున్నారట.