బడ్జెట్‌లో ఉన్నదానికి ఖర్చు చేసినదానికి పొంతనే లేదు

తాజాగా జరుగుతున్న ఏపీ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రత్యర్థుల పట్ల మాటల యుద్దం జరుగుతుంది. తొలుత సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు తన ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర అభివృద్దిని గూర్చి చెప్పుకొచ్చాడు. జగన్‌ సొంత నియోజక వర్గంలో సైతం తెదేపాదే పై చేయి కావడం విశేషం. కాగా బాబు కడపలాగే రాష్ట్రమంతటా ఇదే ఫలితాలు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిపక్ష వైకాపా నేత జగన్‌ మాట్లాడుతూ బాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌ విషయంలో చంద్రబాబు తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని పెదవి విరిచాడు. ప్రభుత్వం పథకాల పేరిట ఖర్చు చేశామని చెబుతుంది కానీ అక్కడ ఖర్చు చేసేదే ఉండదు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో బడ్జెట్‌ విషయంలో కూడా ఇలాగే చేశారని, బడ్జుట్‌ కేటాయింపులు ఒకలా ఉంటే ఖర్చు చేసినవి మరోలా ఉన్నాయి అని జగన్‌ చెప్పుకొచ్చాడు. బడ్జెట్‌ పేరుకే కానీ ఖర్చు చేసేదానికి బడ్జెట్‌కు పొంతనే ఉండదు అని జగన్‌ బాబ సర్కార్‌పై పెదవి విరిచాడు. బాబు సర్కార్‌ ఖర్చు పెట్టకపోయినా కూడా భారీగా ఖర్చు చేసినట్టు చూపించి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు అని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బడ్జెట్‌లో చూపిన దానికంటే సగం కంటే తక్కువే ఖర్చు చేసి మొత్తం తాము ఖర్చు చేసినట్టు సృష్టిస్తారు అని జగన్‌ వ్యాఖ్యానించాడు.