ప్రయత్నించండి...

నలుపు,తెలుపు గదుల మధ్య తప్పటడుగు వేసిన ప్రతిసారి జీవితం 'చెక్' అంటూ మన ఆట కట్టించినట్లే ఉంటుంది.ఏమీకాదు. జీవితాన్ని ఏ క్షణంలోనైనా, ఎక్కడ్నించైనా మళ్ళీ ప్రారంభించవచ్చు.అవసరమైన తాత్విక పునాదులు మనలో లేకపోవచ్చు.అయినా కంగారు పడనవసరం లేదు.ముంచి పోయిందేమి లేదు.కొత్త పునాదులు తవ్వుదాం.పలుగు, పార మీ చేతికి తీసుకోండి.ఇబ్బందుల ఇరుకు గదుల్లోంచి బైటపడటానికి దారులు తప్పక దొరుకుతాయి.

ప్రయత్నించండి....