"పైసా వసూల్" సినిమా రివ్యూ

చిత్రం: పైసా వసూల్
రేటింగ్: 3.0/5.0
సంగీతం : అనూప్ రూబెన్స్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాత : వి. ఆనందప్రసాద్
బ్యానర్: భవ్యా క్రియేషన్స్

స్టారింగ్:బాలకృష్ణ , శ్రియ, ముస్కాన్, కైరా దత్‌. అలీ, విక్రమ్‌జీత్ తదితరులు....

పూరి జగన్నాథ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పైసా వసూల్’ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విదేశాల్లో షోలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం నుంచే ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి.ఇప్పటికే ట్రైలర్‌లో బాలయ్య చెప్పిన డైలాగులు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. ధిమాక్ తోడా.. చాలా తేడా’.. ‘గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోడ్ని మళ్లీ టోర్నమెంట్‌లు పెట్టొద్దు’.. ‘బిహార్‌లో నీళ్లు తాగినవాళ్లని తిహార్‌లో పోయించా.. తు క్యారే హవ్లే’ ఇవి మచ్చుకు ట్రైలర్‌లో చూపించిన కొన్ని డైలాగులు మాత్రమే. సినిమాలో ఇంకా చాలానే ఉన్నాయట. ‘సింహా’ సినిమాలో అప్పటి వరకు చూడని బాలయ్యను చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పుడు మరో కొత్త బాలయ్యని చూసి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.మరీ పూర్తి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
బాబ్ మార్లే (విక్రమ్‌జీత్) ఇంటర్నేషనల్ మాఫియా డాన్. పోర్చుగల్‌లో ఉంటూ ఇండియాలో విధ్వంసాలు సృష్టిస్తుంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి ఇండియన్ పోలీసులు ప్రయిత్నిస్తూ ఉంటారు.మరోవైపు తేడా సింగ్ (బాలకృష్ణ) తీహార్ జైలు నుంచి విడుదలవుతాడు.ఎలాంటి వారినైనా ఎదురించే ధైర్యవంతుడు.బాబ్ తమ్ముడు సన్ని(అమిత్)ను ఇండియన్ ‘రా’ ఆఫీసర్ చంపేస్తాడు.దీంతో ఇండియాలో మారణహోమం సృష్టించాలని బాబ్ నిర్ణయించుకుంటాడు.పోలీస్ అధికారులను కూడా మాఫియా గ్యాంగ్ చంపేస్తుంటుంది. దీంతో చట్టం ప్రకారం వెళ్తే బాబ్‌ను ఏమీ చేయలేమని భావించిన ‘రా’ చీఫ్ (కబీర్‌బేడి).మాఫియాడాన్‌ను పట్టుకోవడానికి తేడా సింగ్‌తో డీల్ కుదుర్చుకుంటాడు.తేడా సింగ్‌తో కలసి ‘రా’ పెద్ద ప్లాన్ వేస్తుంది. అసలు ఈ తేడా సింగ్ ఎవరు? అసలు శ్రియ పాత్రమేటి? అసలు తేడాసింగ్ తీహార్ జైలు కు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? తేడా సింగ్ కు హారిక‌(ముస్కాన్‌),సారిక‌(శ్రియా) లతో సంబంధం ఏంటి అనే తదితర విషయాలు మీరు తెర చూడాల్సిందే.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
తేడా సింగ్ అనే పాత్రలో బాలయ్య చూపించిన వేరియేషన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. ఆయన చెప్పే డైలాగ్స్ ఎంటర్టైన్ చేస్తాయి. క్లైమాక్స్‌లో బాలయ్య చేత పలికించిన దేశభక్తి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.డాన్స్, ఫైట్స్ విషయాల్లో బాలయ్య బాగా కష్టపడ్డాడు.శ్రియ, ముస్కాన్, కైరా దత్ తమ పాత్రల్లో బాగా నటించారు. విక్రమ్‌జీత్ మాఫియా డాన్‌గా మెప్పించాడు. సినిమా మొత్తం తేడా సింగ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. ఆడియన్స్ దృష్టి కూడా ఆ పాత్ర నుంచి మరో పాత్రకు వెళ్లదు.

సాంకేతికపరంగా...
కెమెరా పనితనం బాగుంది. సంగీతం సినిమాకు ప్లస్ అయింది. బాలయ్య పాడిన పాట మాస్‌కు కనెక్ట్ అవుతుంది.పూరి డైరెక్ట్ చేసిన పోకిరి నుంచి ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ పాత్రను కూడా అలానే డిజైన్ చేశాడు. అయితే ఇప్పటివరకు బాలకృష్ణను తెరపై ఏ దర్శకుడు ఈ విధంగా ప్రెజంట్ చేయలేదు. దీంతో ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది.

నచ్చినవి...
బాల‌కృష్ణ యాక్టింగ్ , డైలాగ్స్ , ఫైట్స్
సినిమాటోగ్ర‌ఫీ
ఎడిటింగ్

నచ్చనివి...
పూరి గత చిత్రాల కథనంతో ఉండటం

విశ్లేషణ...
బాలకృష్ణ చేసిన 100 సినిమాలు వేరు.ఈ 101 పైసా వసూల్ మూవీ వేరు. బాలయ్య అభిమానులు ఇప్పటివరకు చూడని బాలయ్య ను ఈ మూవీ లో చూస్తారు. ఇక మాస్ ప్రేక్షకులు కోరుకునే ఫైట్స్ , మసాలా డైలాగ్స్ , రొమాన్స్ , మాస్ సాంగ్స్ ఇలా అన్ని ఉన్నాయి. టైటిల్ కు తగట్టే ప్రేక్షకులనుండి వసూల్ చేసే మూవీ గా పూరి తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. కామెడీ పెద్దగా లేకపోయినా బాలయ్య డైలాగ్స్ , కథలో వచ్చే ట్విస్ట్ లతో సినిమా ఆసక్తి రేపుతోంది. ఓవరాల్ గా ఇది ‘పూరి , బాలయ్య ల వసూల్ మూవీ ‘ అని చెప్పవచ్చు.

చివరగా...
మొత్తం మన పైసలన్నీ వసూల్ అవుతాయి