పెళ్లి కొడుకుగా చైతు ఎలా ఉన్నాడో చూడండి..

అక్కినేని నాగ చైతన్య , సమంతల వివాహం ఈరోజు గోవాలో జరగబోతుంది. రామానాయుడు , అక్కినేని ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈరోజు హిందూ సంప్రదాయంలో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నాగచైతన్య పెళ్లికొడుకుని చేసిన ఫొటోను అక్కినేని నాగార్జున ట్విటర్‌లో పోస్ట్‌ చేసాడు.

ఫొటోలో నాగచైతన్యతో పాటు నాగార్జున, వెంకటేశ్‌ కూడా ఉన్నారు. వరుడి గెటప్‌లో నాగచైతన్య మరింత అందంగా కనిపిస్తున్నారు. ఇక పెళ్లికూతురిగా సమంత ఎలా ఉండబోతోందో అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరపబోతున్నారు. మరి రేపు చైతు ఎలా కనిపిస్తాడో చూడాలి.

ఇక పెళ్లి డీటెయిల్స్ చూస్తే..మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు మెహందీ ఫంక్షన్, రాత్రి 8.30 నుంచి డిన్నర్ ఉంటుంది. ఆ తర్వాత అర్థరాత్రి 11 గంటల 52 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం సమంత మెడలో మూడు ముళ్లు వేస్తాడు చైతు.

తెల్లారి ( 7వ తేదీ ) శనివారం బ్రంచ్ (బ్రేక్ ఫాస్ట్ + లంచ్) తో వేడుకలు మొదలు అవుతాయి. అతిథులకు బ్రంచ్ పూర్తయిన తర్వాత.. క్రిస్టియన్ వెడ్డింగ్ ఉంటుంది. సాయంత్రం 5.30నుంచి 6.30వరకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత డిన్నర్ తో పాటు పార్టీ ఉంటుంది. అర్ధరాత్రి వరకు జరిగే పార్టీతో సమంత-నాగచైతన్య పెళ్లి వేడుక పూర్తవుతుంది.