పవర్‌ఫుల్‌గా వచ్చేసిన అల్లు శిరీష్‌

అల్లు శిరీష్‌ కెరియర్‌ మొదట్లో పెద్దగా చెప్పుకునే హిట్‌లు ఏమి పడలేదు. గత ఏడాది ఈయనకు ‘శ్రీరస్సు శుభమస్తు’ చిత్రంతో మంచి సక్సెస్‌ అందింది. కెరియర్‌లోనే పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్న అల్లు శిరీష్‌ తదుపరి చిత్రాన్ని మళయాలంలో నటిస్తున్నాడు. మోహన్‌లాల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఆ చిత్రంలో అల్లు శిరీష్‌ ఓ వార్‌ ట్యాంకర్‌ ఆపరేటర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మళయాలంలో ఏప్రిల్‌ 7వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించారు. అయితే తొగులో కూడా ఆరోజే విడుదల చేయాలి అనుకుంటే ఆ తేదీన కొన్ని చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండడంతో ఈ చిత్ర విడుదల కాస్త ఆలస్యం అయ్యేలాగే కనిపిస్తోంది.

మళయాలంలో ‘1971 బెయాండ్‌ ద బోర్డర్స్‌’ టైటిల్‌ను ఖరారు చేయగా తెలుగులో ‘1971 భారత సరిహద్దు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో శిరీష్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ యుద్ద రంగంలో పరిగెత్తుతున్నాడు. ఇప్పటి వరకు క్లాస్‌ యాంగిల్స్‌ చూపించిన శిరీష్‌ ఈ చిత్రంలో యాక్షన్‌ యాంగిల్‌ను కూడా చూపించనున్నాడు. శిరీష్‌తో పాటు మోహన్‌లాల్‌ కూడా ఉండడంతో ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చుతున్నారు. ఇటీవలె రానా కూడా ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ‘ఘాజీ’ చిత్రంతో వచ్చి మంచి సక్సెస్‌ను అందుకున్నారు.