పవన్‌ మరో చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌!!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఇటు సినీ రంగంలో దూసుకుపోతూ రాజకీయ రంగంలో కూడా చాలా ఆక్టివ్‌గా ఉంటున్నాడు. రాబోయే సాదారణ ఎన్నికల్లో పవన్‌ తన పార్టీ జనసేన తరుపున రంగంలోకి దిగనున్నాడు. పవన్‌ డాలీ దర్శకత్వంలో నటించిన ‘కాటమరాయుడు’ చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం తర్వాత పవన్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. అనంతరం నేసన్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్‌లు ఒకే కాగా తాజాగా పవన్‌ మరో చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రెండు ప్రారంభం కాని ప్రాజెక్ట్‌లు ఉండగానే మూడు ప్రాజెక్ట్‌కు పవన్‌ సైన్‌ చేశాడు. ‘కందిరీగ’ ఫేం సంతోష్‌ శ్రీనివాస్‌ చెప్పిన కథ పవన్‌కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. పవన్‌ తాజాగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశాడు అనేది పవన్‌ సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మించనున్నారు అని తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే మూడు చిత్రాలు లైనులో ఉండగా తాజాగా మరో చిత్రానికి సైన్‌ చేసిన పవన్‌ 2019వరకు మొత్తం పూర్తి చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నాడు.