నా బిడ్డలు ఒకటి మీ బిడ్డలు ఒకటి కాదు..!!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ డాలీ దర్శకత్వంలో రూపొందిన ‘కాటమరాయుడు’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక నిన్న హైద్రాబాద్‌లో జరిగింది. పవన్‌ ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చి వేడుకను జయప్రదం చేశారు. అభిమానులు కాబోయే సీఎం కాబోయే సీఎం అంటూ చాలాసేపు నినాదాలు చేశారు. కాగా పవన్‌ చివరకు స్పందించి... నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నా, నాకు పదివి ఆకాంక్షలు అసలే లేవు. పదవిలో ఉండి ప్రజల్ని పాలించాలి అనే ఉద్దేశం అసలే లేదు. ప్రజా సమస్యల కోసమే రాజకీయాల్లోకి వచ్చా. వాటిపైనే పోరాడుతాను అంటూ చెప్పుకొచ్చాడు.

నేను రాజకీయాల్లో ఉండగా ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను తీర్చి విధంగా చేస్తాను, తీరితే మంచిది తీరకపోతే ఇంకా మంచిది అంటూ పవన్‌ వ్యాఖ్యానించాడు. నా బిడ్డలు ఒకలాగా, మీ బిడ్డలు ఒకలాగా కాదు అందరి బిడ్డలు నాకు ఒకేలా అని చెప్పుకొచ్చాడు. ప్రజా సమస్యలు తీరాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాదు, కానే కాకూడదు అంటూ పవన్‌ సెలివిచ్చాడు. మొదటి నుండి చెబుతున్నట్టు పవన్‌ అబధికారం కోసం కాదు ప్రజా క్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అంటూ మరో సారి క్లారిటీ ఇచ్చాడు.