"నా నువ్వే" సినిమా రివ్యూ

చిత్రం: నా నువ్వే
రేటింగ్: 2.5/5.0
బ్యానర్ : కూల్ బ్రీజ్ సినిమాస్
సంగీతం : శరత్
దర్శకత్వం : జయేంద్ర
నిర్మాతలు: కిరణ్ ముప్పవరపు

స్టారింగ్ : కళ్యాణ్ రామ్, తమన్నా, పోసాని, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, ప్రవీణ్ తదితరులు

మన జివితాలలో ఏది జరిగిన అంతా విధి ఆడే వింత నాటకం అనుకోవడమే కాక ఆ సూత్రాన్ని పుర్తిగా నమ్మే వ్యక్తికి మరియు అసలు ఏది జరిగినా విధికి సంబందమే లేదనే వ్యక్తికి మధ్యన ప్రేమ కలిగితే ఎలా ఉంటుందో అదే ఈ "నా నువ్వే" . మరి ఈ సినిమా కల్యాణ్ రామ్ ను కొత్తకోణంలో చూపించిందని అభిమానుల టాక్. ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథలోకివెళితే...
వరుణ్ (కళ్యాణ్ రామ్) అమెరికా వెళ్లడానికి వనపర్తి నుంచి బయలుదేరతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన హైదరాబాద్‌లోనే ఆగిపోతాడు. అనుకోకుండా అతని ఫొటో ఒకటి మీరా (తమన్నా) వద్దకు చేరుతుంది. ఆ ఫొటో చూసినప్పుడల్లా మీరాకు అంతా మంచే జరుగుతుంది. పరోక్షంగా వరుణ్ వల్లే రేడియో జాకీ కూడా అవుతుంది. దీంతో అతనే తన లక్కీ అని ప్రేమించేస్తుంది. అతని ఫొటో తన దగ్గరకు రావడం, అతన్ని కలవడం, ప్రేమించడం అంతా విధి వల్లే అని నమ్ముతుంది. కానీ వరుణ్ దాన్ని నమ్మడు. ఇది కచ్చితంగా విధి పనే అయితే నిరూపించుకోవాలని మీరాకు పరీక్ష పెడతాడు. మరి ఆ పరీక్షలో మీరాను విధి ఎలా గెలిపించింది? అనేదే సినిమా.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
కొత్త లుక్‌లో కళ్యాణ్ రామ్ చాలా బాగున్నారు. ఆయన అభిమానులకు ఇదో గిఫ్ట్ అనే చెప్పాలి. చాలా కూల్‌గా, సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కొత్త కళ్యాణ్ రామ్‌ను చూపించారు.సినిమాకు హీరో తమన్నానే. ఆమె అందం, అభినయం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా చేసింది.కథ మొత్తం వీళ్లిద్దరి పాత్రల చుట్టూనే తిరిగినా మీరా ఎమోషన్స్ బాగా చూపించారు. మీరా తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి తన సహజ నటతో ఆకట్టుకున్నారు. ఇక వెన్నెల కిషోర్, ప్రవీణ్, సురేఖావాణి, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికపరంగా...
సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. అందరిలా ఫారన్ లొకేషన్లకు వెళ్లకుండా ఇండోర్‌లోనే అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా తమన్నాను తెరపై చాలా అందంగా చూపించారు. శరత్ సంగీతం సినిమాకు మరో బలం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాను మరీ ఎక్కువగా సాగదీయకుండా రెండు గంటలకే కుదించిన ఎడిటర్‌ను మెచ్చుకోవాలి. నిడివి మరింత ఎక్కువ ఉంటే సినిమా ప్రేక్షకుడికి శిరోభారం అయ్యేది. సున్నితమైన ప్రేమకథను ఎంచుకున్న దర్శకుడు జయేంద్ర కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

విశ్లేషణ...
విధి, అదృష్టాన్ని నమ్మే అమ్మాయి, అలాంటి వాటి మీద అస్సలు నమ్మకంలేని ఓ అబ్బాయి. వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఎలా ప్రేమలో పడ్డారు, వీరితో విధి ఏ విధంగా ప్రవర్తించింది, ఇదే ‘నా నువ్వే’ సినిమా. దీనికి కొంచెం కామెడీ, ఇంకొంచెం ఎమోషన్‌ను జోడించి అందమైన ప్రేమకథగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. తక్కువ పాత్రలతో కన్ఫ్యూజన్ లేకుండా చాలా సున్నితంగా దర్శకుడు సినిమాను తీర్చిదిద్దారు. ట్విస్టులు, డిష్యుం డిష్యుంలు లేకుండా చాలా క్లీన్‌గా కథను ఆవిష్కరించారు. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ తమన్నా ఇంత అందంగా కనిపించలేదనిపిస్తుంది.సున్నితమైన ప్రేమకథను ఎంచుకున్న దర్శకుడు జయేంద్ర కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

నచ్చినవి...
తమన్నా
కల్యాణ్ రామ్

నచ్చనివి...
ఎడిటింగ్
కథలో సాగతీత
స్క్రీన్ ప్లే

చివరగా...
LOVE STORIES నచ్చేవాళ్ళకు ఈ సినిమా నచ్చవచ్చు!!!!