దేవినేని మృతి

ప్రముఖ టీడీపీ నాయకుడు దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం గుండెనొప్పితో మరణించారు. గత కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేనందున హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసినదే. దేవినేని నెహ్రూ మృతితో విజయవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ శ్రేణులు నెహ్రూ ఇంటి పరిసరాల్లోకి చేరుకున్నారు. కేర్ ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్సులో కాసేపట్లో విజయవాడ తీసుకెళ్ల నున్నారు. అక్కడికి చేరే సరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యే అవకాశం ఉంది. కాగా నెహ్రూ మరణవార్త విని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ కుటుంబసభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.