దాసరి ఇక లేరు!!

ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తీవ్రమైన అధిక రక్తపోటుతో బాధపడుతున్న దాసరిని కుటుంబసభ్యులు మే 17వ తేదీన కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా 18వ తేదీనే ఆయనకి ఓ కీలకమైన సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అనంతరం కోలుకుంటున్నారని భావించినప్పటికీ శరీరంలో ఇన్‌ఫెక్షన్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆయన ఆరోగ్యాన్ని విషమంగా మార్చేశాయి. ఈరోజు ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడి కాసేపటి క్రితమే కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 74 ఏళ్లు.