టూర్స్ ప్లాన్ చేసుకోండి...

చౌక‌ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ‌ ఇండిగో కొత్త ప్రమోషనల్ పథకాన్ని ప్ర‌క‌టించింది. 999 రూపాయల నుంచి విమాన టిక్కెట్లను అందివ్వనుంది. ప్రత్యర్థి ఎయిర్‌లైన్ సంస్థ‌లు స్పైస్‌జెట్, గోఎయిర్ కూడా రూ. 999 ఆఫర్లను రుతుపవనాల సీజన్ ప్రారంభంలో ప్రకటించాయి. ఇండిగో ప్ర‌క‌టించిన రూ.999 ఆఫ‌ర్ జూలై 8న స‌మాప్తం అవుతుంది. దీని కింద అందించే టిక్కెట్ల ద్వారా సెప్టెంబ‌రు 27 దాకా ప్ర‌యాణాలు చేయ‌వ‌చ్చు.

ఈ ఆఫ‌ర్లో చెన్నై-బెంగుళూరు మార్గంలో టిక్కెట్ రేటు రూ.999గా ఉండ‌గా, అహ్మ‌దాబాద్ నుంచి ముంబయికి రూ.1349గా ఉంది. మ‌రో వైపు, పేటీఎమ్ ద్వారా చెల్లింపులు చేసి టిక్కెట్లు కొనుగోలు చేస్తే 10శాతం వ‌ర‌కూ అద‌న‌పు రాయితీ ల‌భిస్తుంది. దేశీ రూట్ల‌లో నాన్-స్టాప్ విమానాల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. గ్రూప్ బుకింగ్స్‌కి వ‌ర్తించ‌దు. వేరే ఏ ఇత‌ర ఆఫ‌ర్‌తోనూ, ప్ర‌మోష‌న్‌తోనూ ఈ ఆఫ‌ర్‌ను క‌లిపి బుక్ చేసుకోలేరు.ఎయిర్ ఏషియా ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ కూడా ప్ర‌త్యేక మాన్‌సూన్ ఆఫ‌ర్లు అందిస్తున్నాయి.